Breaking News

రిలీజ్‌కి ముందు ‘పెద్ది’ మేకర్స్‌ కీలక నిర్ణయం!

Published on Sat, 05/30/2026 - 12:44

పెద్ది సినిమా టికెట్‌ ధరలు పెంచేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కోరుతూ మైత్రీ మూవీ మేకర్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. న్యాయస్థానం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో మేకర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు.  తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలనుకున్నారు. ఈ మేరకు హైకోర్టుకు తమ విజ్ఞప్తిని తెలియజేయడంతో..దానికి ధర్మాసనం అనుమతించింది. 

జూన్‌ 4న విడుదలవుతున్న పెద్ది సినిమా టికెట్‌ ధరలను 7 రోజులపాటు పెంచుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ అధికారులకు నిర్మాణ సంస్థ వినతిపత్రం అందించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుద్దాల చలపతిరావు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈనెల 15న వినతిపత్రం ఇచ్చి, 25న మరోసారి విజ్ఞప్తి చేసినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. 

ప్రభుత్వ న్యాయవాది మహేశ్‌ రాజే వాదనలు వినిపిస్తూ దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా తాము కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. గతంలో ఇలాంటి అంశంలోనే ఇదే హైకోర్టు సుమోటో కోర్టు ధిక్కరణ తీసుకుందని గుర్తుచేశారు. కౌంటర్‌ దాఖలుకు సమయం ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. అయితే పిటిషన్‌ ఉపసంహరణకు పిటిషనర్‌ కోరడంతో న్యాయమూర్తి అంగీకరించారు.  ప్రస్తుతం జరిగిన పరిణామాలను పరిశీలిస్తే.. తెలంగాణలో టికెట్స్‌ ధరల పెంపు ఉండకపోవచ్చునని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Videos

9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష

ఐపీఎల్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధం

డీఎస్సీలో తప్పుల మీద తప్పులు.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి

పవన్ అసలు రంగు.. 14 ఏళ్ల బాలిక మరణంతో రాజకీయం

ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన ఆర్టీసీ బస్సు

MPకి ఘోర అవమానం కోడి గుడ్లతో కొట్టిన గ్రామస్థులు

దారుణంగా YSRCP నేతపై దాడి..రక్తంతో

REEL సీఎం కి REAL సీఎంకి తేడా అదే

భూములు ఇవ్వం అని చెప్తే.. పొలాల్లోకి నీళ్ళు వదిలిన కూటమి ప్రభుత్వం

రాజస్థాన్ లో ఇసుక తుఫాన్ బీభత్సం.. వణికిపోయిన ప్రజలు

Photos

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07)

+5

విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు)

+5

చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు)

+5

ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆకట్టుకున్న ఏయూ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫొటోలు)

+5

సిస్టమ్‌ మూవీ బాలనటితో జ్యోతిక పోజులు (ఫొటోలు)

+5

హీరోయిన్ మీనాక్షి చౌదరి స్మైలీ లుక్స్ (ఫొటోలు)

+5

ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు)

+5

టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)