Breaking News

పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే?

Published on Thu, 06/18/2026 - 07:07

రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పటికే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలోనే ‍అత్యధిక వసూళ్లు సాధించిన సౌతిండియా సినిమాగా నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

అయితే జాన్వీ కపూర్‌ సీన్స్‌పై వివాదం రావడంతో పెద్ది మేకర్స్ సరిదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సీన్స్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ బుచ్చిబాబు కొత్త వాటిని యాడ్ చేస్తామని ప్రకటించారు. కానీ అవీ ఎప్పటి నుంచి అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయాన్ని పెద్ది మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎన్ని నిమిషాల సీన్స్‌ కొత్తగా యాడ్ చేస్తున్నామనే విషయాన్ని ప్రకటించారు.

పెద్ది అభిమానులకు మేకర్స్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ కొత్తగా దాదాపు ఐదు నిమిషాల 56 సెకన్ల పాటు కొత్త సన్నివేశాలు యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సీన్స్‌ నేటి నుంచే థియేటర్లలో సందడి చేస్తాయని వెల్లడించారు. 
ఇప్పటికే కొత్త సన్నివేశాలకు సంబంధించిన సెన్సార్‌ కూడా పూర్తి కావడంతో పెద్ది మూవీకి లైన్ క్లియర్ అయింది. దీంతో గురువారం నుంచి అదనంగా వచ్చిన సన్నివేశాలతో పెద్ది రన్ కానుంది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

రూ. 500 కోట్ల క్లబ్‌లో పెద్ది..?

ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న పెద్ది బాక్సాఫీస్ వద్ద మరో రికార్డ్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా సీన్స్ రావడంతో ఫ్యాన్స్ మళ్లీ థియేటర్లకు వెళ్లే ఛాన్స్ ఉంది. అందువల్లే మేకర్స్ కూడా పక్కా ప్లాన్‌తోనే ఈ సన్నివేశాలను కాస్తా ఆలస్యంగా థియేటర్లకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాల కోసమైనా అభిమానులు, సినీ ప్రియులు మరోసారి పెద్దిని చూసేందుకు ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే జరిగితే పెద్ది రూ.500 కోట్ల మార్క్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాదు. కాగా.. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఆకట్టుకుంది. 
 

 

Videos

సర్కార్ పై గులాబీ సమరం

పుష్ప శ్రీవాణిపై పోలీసుల ఓవరాక్షన్ చీర లాగి దురుసు ప్రవర్తన..

పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్

తెలంగాణ బీజేపీ నేతల అరెస్ట్..!

మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?

అమెరికా రక్షణ శాఖలో తీవ్ర కలకలం!

నేపాల్ వరదల్లో చిక్కుకున్న బాధిత ఫ్యామిలీ ఆవేదన

మంత్రి పదవి ఊస్ట్ హుటాహుటిన ఢిల్లీకి కొండా సురేఖ

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సాధిక్ ఖాన్ తరలింపు

Hyderabad: దొంగలు బాబోయ్ దొంగలు

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)