Breaking News

ఛీ కొట్టినవారితో చప్పట్లు.. కల్యాణ్‌ విజయానికి కారణాలివే!

Published on Sun, 12/21/2025 - 23:03

తప్పులు చేయని మనిషంటూ ఉండడు. కానీ ఆ తప్పులు తెలుసుకుని సరిదిద్దుకున్నవాడే జీవితంలో ముందుకు వెళ్తాడు. బిగ్‌బాస్‌ షోలోనూ ఇదే వర్తిస్తుంది. అగ్నిపరీక్షలో కల్యాణ్‌ దూకుడు, అతడిలోని కసి చూసి.. ఇలాంటి కంటెస్టెంట్‌ కదా బిగ్‌బాస్‌కు కావాల్సింది అనుకునేలా చేశాడు. అతడి ఆట, మాట తీరు చూసి విన్నర్‌ మెటీరియల్‌ అని ముందుగానే ఫిక్సయిపోయారు.(Kalyan Padala Bigg Boss Winning Reasons)

అంతా తలకిందులు
కట్‌ చేస్తే బిగ్‌బాస్‌ 9కి వచ్చాక పరిస్థితి తలకిందులైంది. పిక్నిక్‌కు వచ్చినట్లు ఓ మూలన కూర్చునేవాడు. ఏదో కరువులో ఉన్నట్లు అమ్మాయిలను ఓరగా చూస్తూ అదే పెద్ద పనిగా పెట్టుకున్నాడు. ఇతడు చేసిన పనులకు మూడోవారం ఎలిమినేట్‌ అయి వెళ్లిపోయేవాడే! కానీ నాగార్జున చెప్పిన హింట్లను గ్రహించాడు. ఎప్పుడూ ఆడాళ్ల చేతులు రాస్తూ కూర్చోవడమేనా? అని నాగ్‌ గడ్డి పెట్టడంతో తేరుకున్నాడు. ఇలాగే ఉంటే నీ ఆట ముగిసిపోతుందని వార్నింగ్‌ ఇవ్వడంతో అలర్ట్‌ అయ్యాడు.

రూటు మార్చాడు
అప్పటికే వరుసగా కామనర్లు ఎలిమినేట్‌ అవుతుండటంతో ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకున్నాడు. ఆట, మాట, తీరు అన్నీ మార్చుకున్నాడు. అగ్నిపరీక్షలో కనిపించిన కల్యాణ్‌ను తిరిగి చూపించాడు. నాలుగోవారం నుంచి విజృంభించి ఆడాడు. టాస్కులు వస్తే గెలిచేవరకు వేటాడాల్సిందే అన్నంత కసిగా ఆడాడు. అందరితోనూ కలిసిపోయాడు. మనింటి కుర్రాడే అన్నంతగా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు.

జనాలకు కనెక్ట్‌..
తనకు ఇష్టమైనవాళ్లు ఎలిమినేట్‌ అయినా, బాధపడుతున్నా అస్సలు తట్టుకునేవాడు కాదు. వాళ్లకు ఏదైనా బాధ వచ్చిందంటే ఇతడే ఎక్కువ ఏడ్చేవాడు. అలా కల్యాణ్‌ స్వభావానికి ప్రేక్షకులు కనెక్ట్‌ అయ్యారు. ఎన్నో అవమానాలు పడ్డ కల్యాణ్‌ పడ్డచోటే లేచి నిల్చున్నాడు. ఛీ కొట్టినవారితోనే శెభాష్‌ అనిపించేలా చేసుకున్నాడు. తనూజతో పోటీపడేవాళ్లే లేరా? అన్న సమయంలో అందరికీ ఓ ఆశాదీపంలా కనిపించాడు.

కలిసొచ్చిన ప్రచారం
కల్యాణ్‌ కోసం సోషల్‌ మీడియాలో బోలెడంత సింపతీ ప్రచారం జరిగింది. సోల్జర్‌ అని, పేదవాడు అని రకరకాలుగా ప్రచారం చేశారు. అది అతడికి బాగా కలిసొచ్చింది. అయితే హౌస్‌లో మాత్రం అతడెప్పుడూ ఆ కార్డులు బయటకు తీసి వాడుకోవాలని చూడలేదు. కానీ బిగ్‌బాస్‌ మాత్రం కుదిరినప్పుడల్లా అతడు జవాన్‌ అని గుర్తు చేశాడు. 'జై జవాన్‌' అన్న నినాదం అతడి విజయంలో కీలక పాత్ర పోషించింది.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)