Breaking News

స్క్రిప్టెడ్ కాదు.. పరోక్షంగా తనూజకు ప్రపోజ్‌ చేశాడా ?

Published on Tue, 12/16/2025 - 12:00

బిగ్‌బాస్‌ అంటేనే నటనతో కూడిన బాండింగ్స్‌ ఉంటాయని తెలిసిందే. కొందరు స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్‌లో తమ ఆటను కొనసాగిస్తారు. ఈ సీజన్‌లో కూడా డీమాన్ పవన్-రీతూ చౌదరిల ట్రాక్‌తో పాటు తనూజ-కల్యాణ్‌ల ట్రాక్‌ కూడా కొనసాగింది. అయితే, తనూజ పట్ల కల్యాణ్‌ నిజంగానే కాస్త ఆసక్తి చూపుతున్నట్లు సులువుగా అర్థం అవుతుంది. కానీ, తనూజ మాత్రం తనతో ఫ్రెండ్‌గానే బంధాన్ని కొనసాగిస్తుంది. అయితే, సోమవారం జరిగిన ఎపిసోడ్‌లో నామినేషన్‌లు లేవు కాబట్టి బిగ్‌బాస్‌ వారికి ఒక టాస్క్‌ ఇచ్చాడు. తమ జర్నీ గురించి చెప్పాలంటూ ప్రతి ఒక్కరినీ బిగ్‌బాస్ అడిగాడు. ఈ క్రమంలోనే తనూజ గురించి కల్యాణ్‌ చెప్పిన మాటలు కాస్త ఆసక్తిగానే ఉన్నాయి.

ఈ సీజన్‌ బిగ్‌బాస్‌ విన్నర్‌ అనేది తనూజ, కల్యాణ్‌ల మధ్యే ఉంది. టైటిల్‌ రేసులో ఉన్న వారిద్దరూ కూడా చాలా స్నేహంగా ఉన్నారు. బిగ్‌బాస్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని చెప్పాలి.  అయితే, తన జర్నీ గురించి హౌస్‌మేట్స్‌తో కల్యాణ్‌ ఇలా చెప్పుకొచ్చాడు. తనకు 8 ఏళ్ల వయసు నుంచే సినిమాలంటే పిచ్చి అంటూ తెలిపాడు. వెండితెరపై తన పేరు కూడా కనిపించాలనే ఆశ ఎక్కువగా ఉండేదని గుర్తుచేసుకున్నాడు.  బిగ్‌బాస్‌  జర్నీ తనకు గుర్తుండిపోయే సన్నివేశాలను చాలానే  ఇచ్చింది  అన్నాడు.

తనూజపై కల్యాణ్‌ ప్రేమ
తనూజ,  కల్యాణ్‌ల మధ్య ప్రేమ చిగురించిందని పలు యూట్యూబ్, సోషల్ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే  కల్యాణ్ బయటపడ్డాడు. తన జర్నీ గురించి చెప్పే క్రమంలో.. తనూజ వైపు కల్యాణ్ చూస్తూ ఇలా అన్నాడు 'జీవితాంతం ఈమె (తనూజ) ఫ్రెండ్‌షిప్ కోరుకుంటున్నాను.. కాదు, ఫ్రెండ్‌షిప్‌ను మించి అంటూ స్ట్రెయిటుగా చెప్పేశాడు. తనూజతో ఉన్న ఈ బాండ్ ఇలాగే ఉంటుంది. ఉండాలని అనుకుంటున్నాను. ఈ పర్సన్ ఏంటంటే మనతో పాటు ఆలోచించి అవతలి వాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించే గుణం తనూజలో ఉంది. అందుకే మోర్ దేన్ ఫ్రెండ్‌షిప్ తనూజతో ఉండాలని అనుకుంటున్నాను.' అని కల్యాణ్‌ అన్నాడు.  అయితే,  ఆమె నుంచి కూడా సానుకూల చూపులు కనిపించాయి. కాస్త సిగ్గుతో ఆమె తలదించుకుంది.

ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలే
కామనర్‌గా కల్యాణ్ బిగ్‌బాస్‌లోకి వచ్చాడు. కానీ, తనూజ అప్పటికే సెలబ్రిటీ. సిరీయల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది. అయితే, ప్రస్తుతం ఇద్దరూ సెలబ్రిటీలే. ఎవరూ తక్కువ కాదు. కొందరైతే మరో విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.  కల్యాణ్ మదర్‌ హౌజులోకి వచ్చి వెళ్తున్నప్పుడు తనూజ ఓ చీరెను గుర్తుగా ఇచ్చింది. దీని గురించి కల్యాణ్‌ కూడా తనూజను పలు ప్రశ్నలు అడిగాడు కూడా.. కానీ, ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు. దీంతో వారిద్దరి మధ్య బాండింగ్‌ మరింత పెరిగిపోయింది.  ఎంతలా అంటే తనూజ కోసం కప్‌ త్యాగం చేస్తావా అని బిగ్‌బాస్‌ అడిగితే.. వెంటనే కల్యాణ్‌ ఓప్పేసుకుంటాడేమో అనేలా తన పరిస్థితి ఉంది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)