Breaking News

మొన్న ట్రైలర్‌.. నేడు సినిమా.. ఓజీ ఫ్యాన్స్‌కు మరో బ్యాడ్‌ న్యూస్!

Published on Tue, 09/23/2025 - 14:45

పవన్ ‍కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్‌ చేయగా.. ఆడియన్స్‌ నుంచి మిక్స్‌డ్‌ టాక్ వస్తోంది. మాఫియా నేపథ్యంలోన తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఆడియన్స్‌ను బ్యాడ్‌న్యూస్. ఓవర్సీస్‌ అభిమానులకు  ప్రత్యంగిరా సినిమాస్ ఊహించని ఝలక్ ఇచ్చింది. ఓజీ తమిళ వర్షన్‌  నార్త్‌ అమెరికాలో రిలీజ్  చేయడం లేదని  వెల్లడించింది.  కేవలం తెలుగు, హిందీ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతుందని ట్వీట్ చేసింది. తమిళంలో రిలీజ్ కాకపోవడానికి గల కారణాన్ని వివరించింది.

కంటెంట్‌ ఆలస్యం కారణంగానే ఓజీ తమిళ వెర్షన్ ఉత్తర అమెరికాలో విడుదల కావడం లేదని తెలిపింది. అయితే తెలుగు, హిందీ వర్షన్లు ముందు అనుకున్న ప్రకారమే  నార్త్ అమెరికా అంతటా ప్రదర్శిస్తామని పోస్ట్ చేసింది. మీకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నామని ప్రత్యంగిరా సినిమాస్ ట్వీట్‌ చేసింది.

కాగా.. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ట్రైలర్‌ అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాలేదు. టైమ్, డేట్‌ ప్రకటించినా అనుకున్నట్లు విడుదల చేయలేకపోయారు. దీంతో ఓజీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా ఉత్తర అమెరికాలో తమిళ వర్షన్ రిలీజ్‌ చేయకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్‌కు నిరాశ తప్పేలా లేదు. సకాలంలో కంటెంట్‌ అందించలేకపోయినా ఓజీ మేకర్స్‌  ఈ విషయంలో పూర్తిగా విఫలమైనట్లు కనిపిస్తోంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)