Breaking News

'హరిహర వీరమల్లు సినిమా అడ్డుకుంటాం'

Published on Mon, 07/07/2025 - 08:44

పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా (Hari Hara Veeramallu)కు చిక్కులు తప్పేలా లేవు. ఈ మూవీ పూర్తి కల్పితమని, ప్రజావీరుడు పండగ సాయన్న జీవిత చరిత్రను తీసుకుని చరిత్రలో ఎక్కడాలేని కల్పిత పాత్రలతో ఈ సినిమా తీస్తున్నారని బీసీ సంఘం నాయకుడు, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థి డాక్టర్‌ శివ ముదిరాజ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చరిత్రను వక్రీకరించే ఈ సినిమాను అడ్డుకుంటామని, త్వరలో ఈ చిత్రంపై హైకోర్టులో పిల్‌ వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పండగ సాయన్న జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీశారని తాము ఆరోపించగా చిత్రయూనిట్‌ తప్పును సమర్థించుకుకోవాలని చూసింది. ఇది పండగ సాయన్న మూవీ కాదని, 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర బుక్కరాయలు కథ అని చెప్పారు.

కానీ, సినిమా ట్రైలర్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. డబ్బుల కోసం చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తప్పకుండా అడ్డుకుంటాం. త్వరలోనే హైకోర్టును ఆశ్రయిస్తాం అని శివ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే.. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం సమర్పణలో దయాకర్‌ రావు నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ మూవీ జూలై 24న విడుదల కానుంది.

చదవండి:విశ్వంభర డేట్‌ ఫిక్స్‌?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)