Breaking News

ఏంటి పవన్‌ 'బ్రో' ఇన్ని సినిమాలు ఉన్నాయా ఆ లిస్ట్‌లో..!

Published on Thu, 07/27/2023 - 17:30

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'  రీమేక్‌ సినిమాతో తన కెరియర్‌ను మొదలు పెట్టాడు పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లో ప్రస్తుతం టాప్‌లో ఉన్నటువంటి పముఖ హీరోలల్లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసింది పవన్ అనే చెప్పవచ్చు. ఒక రకంగా హిట్స్ కోసం రీమేక్‌ల మీదే పవన్ ఆధారపడ్డాడని కూడా చెప్పవచ్చు. తన సినీ కెరీర్ మలుపుతిప్పిన సినిమాలన్నీ ఒకసారి చూస్తే రీమేక్ లే అని తెలుస్తుంది. 

(ఇదీ చదవండి: చిరంజీవి 'భోళా శంకర్‌' ట్రైలర్‌ వచ్చేసింది)

మెగా హీరోలు నటించిన బ్రో సినిమా జులై 28న విడుదల కానుంది. ఈ సినిమా పవన్‌ కల్యాణ్‌కు 28వ చిత్రం కాగా సాయి ధరమ్‌ తేజ్‌కు 15 వ సినిమా కానుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. రీమేక్‌ చిత్రాల జాబితాలో పవన్‌కు ఇది 13వ చిత్రం కాగా సాయిధరమ్‌ తేజ్‌కి ఇది మొదటి రిమేక్‌ మూవీగా నిలవనుంది. కోలీవుడ్‌ నుంచి 2021లో విడుదలైన 'వినోదయ సిత్తం'  సినిమాకి రీమేక్‌గా 'బ్రో'ని రూపొందించారు. ఈ సినిమాను అక్కడ కూడా సముద్రఖనినే డైరెక్ట్‌ చేశారు. 

పవన్‌ రీమెక్‌ సినిమాల లిస్ట్‌ ఇదే
'బ్రో' సినిమాకు ముందు పవన్‌  నటించిన రీమేక్‌ చిత్రాల జాబితాలో ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, ఖుషి, తీన్‌మార్‌, అన్నవరం, గబ్బర్‌సింగ్‌, సర్దార్ గబ్బర్ సింగ్, గోపాల గోపాల, కాటమరాయుడు, వకీల్‌సాబ్‌, భీమ్లానాయక్‌ ఇప్పుడు బ్రో ఇలా వరుసుగా ఉన్నాయి. అంటే పవన్‌ చేసిన మొత్తం 28 సినిమాల్లో 13 సినిమాలు రీమేక్‌లు కావడం విశేషం.

(ఇదీ చదవండి: అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌)

ఈ సినిమాలలో కొన్ని టాలీవుడ్‌లో మెప్పించినా.. మరికొన్ని మిస్‌ ఫైర్‌ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా వేరే భాషలలో సూపర్‌ హిట్‌ అయిన సినిమాలే కావడం విశేషం. జులై 28న విడుదల కానున్న బ్రో రీమేక్‌ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పడం కష్టం.  రాజకీయం, సినిమా ఇలా రంగం ఏదైనా సరే మరోకరిపైనా ఆధారపడటం పవన్‌కు కామన్‌ పాయింటేనని ఈ జాబితాను చూసిన కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

(ఇదీ చదవండి: అతనితో డేటింగ్‌లో భారత మహిళా క్రికెటర్‌.. ఫోటోలు వైరల్‌)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)