కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేశ్
Published on Thu, 06/30/2022 - 17:20
మైసూరు (కర్ణాటక): సీనియర్ నటి పవిత్ర లోకేష్ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తెరిచారని, అంతటితో ఆగకుండా తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫేక్ అకౌంట్ల ద్వారా తన గురించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు.
కాగా దివంగత కన్నడ నటుడు మైసూరు లోకేశ్ కుమార్తె పవిత్ర లోకేశ్. తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో సౌత్ ప్రేక్షకులకు దగ్గరైంది పవిత్ర. ఇకపోతే పవిత్ర.. టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్‌ను పెళ్లి చేసుకోబోతుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! దీనిపై అటు నరేశ్ కానీ, ఇటు పవిత్ర కానీ ఇంతవరకు స్పందించనేలేదు.
చదవండి: మేజర్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
మిస్ ఇండియా పోటీ నుంచి వైదొలగిన శివానీ
Tags : 1