Breaking News

అణువణువునా నువ్వే.. చనిపోయిన భార్యకోసం నటుడు ఏం చేశాడంటే?

Published on Mon, 08/18/2025 - 15:47

'కాంటా లగా..' పాటతో ఫేమస్‌ అయిన బాలీవుడ్‌ నటి షెఫాలీ జరివాలా (42) జూన్‌ 27న మరణించింది. చిన్న వయసులోనే భార్య తనను వదిలి వెళ్లడంతో నటుడు పరాగ్‌ త్యాగి శోకసంద్రంలో మునిగిపోయాడు. అంత్యక్రియల సమయంలోనూ భార్య మృతదేహాన్ని పట్టుకుని బోరున విలపించాడు. రోజులు గడిచేకొద్దీ భార్య జ్ఞాపకాలతో మరింత కుమిలిపోతున్నాడే తప్ప ఆ బాధ నుంచి బయటపడలేకపోతున్నాడు. ఇంతలోనే వారి పెళ్లి రోజు వచ్చింది. 

వెడ్డింగ్‌ యానివర్సరీ
ఇద్దరి ప్రేమ బంధానికి 15 ఏళ్లు. కానీ, ఈసారి వెడ్డింగ్‌ యానివర్సరీ సెలబ్రేట్‌ చేసుకోవడానికి భార్య లేకుండా పోయింది. అయినా సరే.. పరి (షెఫాలీని ప్రేమగా పిల్చుకునే పేరు) కోసం ఇదే నా గిఫ్ట్‌ అంటూ ఓ వీడియో షేర్‌ చేశాడు. తన ఛాతీపై షెఫాలీ ముఖాన్ని పచ్చబొట్టు వేయించుకున్నాడు. పంటికింద నొప్పిని భరిస్తూ భార్య ఫోటోను ఎదపై భద్రంగా పదిలపర్చుకున్నాడు. 

ప్రేమకు పదేళ్లు 
'తను నా హృదయంలో ఎల్లప్పుడూ ఉంటుంది. నా శరీరంలోని అణువణువునా తనే ఉంది. ఇప్పుడది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది' అని వీడియోకిచ్చిన క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు నీ ప్రేమను చూస్తుంటే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. షెఫాలీ జరివాలా, పరాగ్‌ త్యాగి.. 2010 ఆగస్టు 12న తొలిసారి కలుసుకున్నారు. కొద్దిరోజులకే ప్రేమలో పడ్డారు. 2014లో వీరు కలుసుకున్న ఆగస్టు 12వ తేదీనే పెళ్లి చేసుకున్నారు. ఇది షెఫాలీకి రెండో పెళ్లి. గతంలో ఆమె హర్మీత్‌ సింగ్‌ను పెళ్లి చేసుకోగా 2009లో విడాకులిచ్చింది.

 

 

చదవండి: కొత్తింట్లో గృహప్రవేశం చేసిన బిగ్‌బాస్‌ మానస్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)