Breaking News

బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చానంటే?.. రైతు బిడ్డ సమాధానం ఇదే!

Published on Tue, 12/19/2023 - 16:19

రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్‌ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్‌ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్‌కు బిగ్‌బాస్‌కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్‌బాస్‌పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్‌ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఇచ్చిన ఎగ్జిట్‌ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. 

ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లో నాకు తెలిసిందే కూకట్‌పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్‌గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా.' అని అన్నారు. 

రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్‌ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్‌గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)