Breaking News

అన్నం కూడా తిననియలే.. నాకు చాలా బాధగా ఉంది: ప్రశాంత్

Published on Tue, 12/19/2023 - 21:22

ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ విన్నర్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌ అయిన అమర్‌దీప్‌, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్‌పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్‌బాస్‌ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్‌పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా.  నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)