Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా

Published on Wed, 09/02/2026 - 08:29

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలానే కొరియన్ కనకరాజు, డిసి, ఉన్మాదం లాంటి పలు భాషల్లో హిట్ అయిన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. గాంధారి లాంటి ఓటీటీ మూవీతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి డబ్బింగ్ సిరీసులు కూడా ఆసక్తి రేపుతున్నాయి. ఇవలా ఉండగానే హీరో నాగార్జున నిర్మించిన ఓ చిత్రం ఎలాంటి సౌండ్ లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులో ఉంది?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'ఇరుముడి' పాప థ్రిల్లర్ సినిమా)

గత కొన్నేళ్లుగా తెలంగాణ నేపథ్యంగా పలు సినిమాలు వస్తున్నాయి. అలా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిన్న మూవీ 'పళ్లబురుసు'. బలగం చిత్రంలో నటనతో ఆకట్టుకున్న సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో ప్రధాన పాత్రలు చేశారు. గత నెలలో అంటే ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్లు పర్లేదనిపించారు గానీ కంటెంట్ ఓ మాదిరిగా ఉండేసరికి జనాలు దీన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఇప్పుడు మూడు వారాల్లోపే అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అవుతోంది.

'పళ్లబురుసు' విషయానికొస్తే.. తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే వృద్ధుడు శంభు(సుధ). ఓసారి పంటినొప్పితో ఆస్పత్రికి వెళ్లగా, చికిత్స చేసిన డాక్టర్.. వేపపుల్ల కాకుండా టూత్ బ్రష్ వాడాలని చెబుతుంది. దీంతో ఇది కొనివ్వమని శంభు, తన కొడుకు తిరుపతి(మురళీధర్ గౌడ్)ని అడుగుతాడు. కానీ వేరే పనుల్లో పడిపోయి తిరుపతి ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. దీంతో శంభుకి కోపమొస్తుంది.

సరిగ్గా అదే టైంలో తనని పిలవకుండా మనవరాలి పెళ్లిని కొడుకు చేయడంతో శంభు అవమానంగా ఫీలవుతాడు. దీంతో పళ్లబురుసు కొనివ్వలేదని కొడుకుపై కేసు పెట్టేందుకు పోలీస్‌ స్టేషన్‌‌కి వెళ్తాడు. ఈ కేసు వల్ల తండ్రీకొడుకుల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి? అసలు తిరుపతి తన తండ్రిని పట్టించుకోకపోవడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేది మిగిలిన స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా?)

Videos

AP: రైతులంటే ఎందుకు మీకు అంత కక్ష..?

బాబు.. సిద్ధంగా ఉండు.. జగన్ గెలుపు ఖాయం..

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)