Breaking News

'ఆదిపురుష్' రిజల్ట్.. ఇన్నాళ్లకు ఒప్పుకొన్న ఓం రౌత్

Published on Tue, 09/23/2025 - 13:58

ఆదిపురుష్.. ఈ పేరు చెబితే చాలు ప్రభాస్ ఫ్యాన్స్, దర్శకుడు ఓం రౌత్‌పై ఇంతెత్తున ఎగిరిపడతారు. ఎందుకంటే మూవీలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. పురాణాల్లో రాముడు, రావణాసురుడు అంటే కొన్ని అంశాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిగా మార్చేసి ఇష్టమొచ్చినట్లు ఓం రౌత్ తీయడంపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఏ గ్రాఫిక్స్ మూవీ వచ్చినా సరే ఔం రౌత్‌పై కచ్చితంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే రిలీజ్ తర్వాత దీని గురించి ఎప్పుడూ మాట్లాడని ఈ దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పందించాడు. విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడో చెప్పాడు.

(ఇదీ చదవండి: హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్)

'జీవితంలో తప్పులు చేయడం సహజం. హిట్ సంతోషాన్ని ఇస్తుంది. ఫ్లాప్ పాఠం నేర్పిస్తుంది. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ముందుకెళ్లిపోవడమే జీవితం. అదే మనిషిని బతికిస్తుంది. 'ఆదిపురుష్' విషయంలో వచ్చిన విమర్శల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. టీమ్‌తో పాటు ఆ ప్రభావం నా కుటుంబంపైనా పడింది. ఫలితంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. అలా కోలుకోగలిగాను. ప్రేక్షకుల నమ్మకం తిరిగి పొందేందుకు ఇప్పుడు చాలా కష్టపడాలి' అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.

2015లో 'లోక్‌మాన్య' అనే మరాఠీ సినిమాతో దర్శకుడు అయిన ఓం రౌత్.. తర్వాత హిందీలో 'తానాజీ' అనే పీరియాడికల్ మూవీతో హిట్ కొట్టాడు. ఎప్పుడైతే 'ఆదిపురుష్' వచ్చిందో ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పటినుంచి మరో చిత్రం చేయలేదు. రీసెంట్‌గా 'ఇన్‌స్పెక్టర్ జెండే' మూవీని నిర్మించగా ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం ధనుష్‌తో అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాడా సరేసరి లేదంటే మాత్రం అంతే!

(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)