Breaking News

ఓటీటీలో 'ఓజీ'.. నెలరోజుల్లోనే స్ట్రీమింగ్‌!

Published on Mon, 10/06/2025 - 16:50

కాంతార సినిమాకు క్రేజ్‌ దక్కడంతో పవన్‌ కల్యాణ్‌ నటించిన ఓజీ చిత్రంపై భారీ దెబ్బ పడింది. ఓజీ కేవలం మొదటిరోజు మాత్రమే భారీ కలెక్షన్స్‌ సాధించినప్పటికీ  ఆ  తర్వాత థియేటర్ల పరిస్థితి ధారుణంగా మారింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా కాంతార జోరు ఉండటంతో ఓజీ థియేటర్స్‌ ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో ఓటీటీ బాటలోకి  ఓజీ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కేవలం నెలరోజుల్లోనే స్ట్రీమింగ్‌కు రానున్నట్లు తెలుస్తోంది.

ఓజీ సినిమా నెట్‌ఫ్లిక్స్ (NetflixI) ఓటీటీ (OTT)లో ఆక్టోబ‌ర్ 23 నుంచి తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల్లోనే ఓటీటీలో విడుదల అయ్యేలా ఆ సంస్థతో  ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీ వర్షన్‌లో కొన్ని అదనపు సీన్లు యాడ్‌ చేస్తారని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది.

భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 25న ఓజీ విడుదలైంది. అయితే, కలెక్షన్స్‌ పరంగా టాలీవుడ్‌ రికార్డ్స్‌ తిరగరాయాలని అత్యధిక ప్రీమియర్‌ షోలు (336) వేసి ఒక్కో టికెట్‌ ధర రూ. 1000 నిర్ణయించడంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. కానీ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ వంటి అగ్రహీరోల మొదటిరోజు కలెక్షన్ల రికార్డ్స్‌ను ఎంత మాత్రం టచ్‌ చేయలేకపోయింది. ఓజీ రెండోరోజు నుంచే ఒక్కసారిగా 80 శాతం పైగా కలెక్షన్స్‌ తగ్గిపోయాయి. కాంతార విడుదల తర్వాత కలెక్షన్స్‌ పరిస్థితి మరింతగా తగ్గిపోయాయి.   ఇప్పటి వరకు ఓజీ రూ. 183 కోట్ల నెట్‌ సాధించినట్లు ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిల్క్ పేర్కొంది. ఈ మూవీలో పవన్‌ కల్యాణ్‌తో పాటు ఇమ్రాన్‌ హష్మీ, ప్రియాంక మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌, శ్రియా రెడ్డి వంటి వారు నటించారు.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)