Breaking News

'ఓజీ' కొత్త గ్లింప్స్ రిలీజ్

Published on Tue, 09/02/2025 - 16:26

'ఓజీ' సినిమా నుంచి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం.. కారుపై ఓజీ కూర్చున్న ఓ కొత్త లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. ఇందులో విలన్ పాత్రధారిని పరిచయం చేశారు. అతడి పాత్ర పేరు ఓమి. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ రోల్ చేశాడు. సదరు పాత్రతో గ్లింప్స్ చివరలో హ్యాపీ బర్త్ డే ఓజీ అని చెప్పించారు.

(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. సైలెంట్‌గా మొదలుపెట్టేశారు)

అంతా బాగానే ఉంది గానీ పవన్ పుట్టినరోజు సందర్భంగా అతడిని హైలైట్ చేసే గ్లింప్స్ లాంటిది పడితే అభిమానులు కాస్త ఖుషీ అయ్యేవారు. అలా కాకుండా హీరో కంటే విలన్ పాత్రకు ఎక్కువ ఎలివేషన్స్ ఇచ్చేలా గ్లింప్స్ రిలీజ్ చేయడం కాస్త విచిత్రంగా అనిపించింది.  ఎప్పటిలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ బాగున్నాయి.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాని ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సుజీత్ దర్శకుడు కాగా తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమాకు అభిమానుల్లో బజ్ గట్టిగానే ఉంది. పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు' దారుణంగా ఫెయిల్ అవడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి సమంత దుబాయి ట్రిప్.. వీడియో వైరల్)

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)