Breaking News

తన వల్లే నా పెళ్లి జరిగింది: నుపుర్ సనన్

Published on Wed, 01/14/2026 - 19:20

బాలీవుడ్ భామ, హీరోయిన్ కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్‌ ఇటీవలే పెళ్లి చేసుకుంది. తన ప్రియుడైన స్టీబిన్‌ను పెళ్లాడింది ముద్దుగుమ్మ. మొదటి క్రిస్టియన్ సంప్రదాయంతో వివాహం చేసుకున్న బ్యూటీ.. ఆ తర్వాత హిందూ సంప్రదాయంలోనూ గ్రాండ్‌గా పెళ్లి వేడుకను జరుపుకుంది. ఈ పెళ్లిలో ఆదిపురుష్ బ్యూటీ కృతి సనన్‌ సందడి చేసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ముందుండి నడిపించింది.

అయితే వీరిద్దరిదీ ఇంటర్‌ క్యాస్ట్ మ్యారేజ్ అన్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లికి నుపుర్ సనన్ మదర్‌ ఒప్పుకోలేదు. ఆమె ససేమిరా అనడంతో కృతి సనన్‌ రంగంలోకి దిగింది. సిస్టర్‌ కోసం అమ్మను  ఒప్పించి మరీ ఈ పెళ్లి జరిపించింది ముద్దుగుమ్మ. తాజాగా తన అక్క స్టీబిన్ గురించి తల్లిని ఎలా ఒప్పించిందో కూడా నుపుర్ సనన్ వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నుపుర్ ఈ విషయాన్ని పంచుకుంది.

నుపుర్ సనన్ మాట్లాడుతూ.. "స్టీబిన్ గురించి నేను మొదట చెప్పింది నా సోదరికే. మా ఇద్దరి మధ్య ఐదేళ్ల వయస్సు తేడా ఉన్నప్పటికీ మేము చాలా క్లోజ్‌గా ఉంటాం. అంతేకాదు ప్రాణ స్నేహితులం కూడా. స్టీబిన్ వృత్తిపరంగా ఇప్పుడే కెరీర్ ప్రారంభించాడు. కాబట్టి కెరీర్ పరంగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. నేను అతని గురించి ఒక వ్యక్తిగా ఎక్కువగా చెప్పా. తనకు అతని పాట వినిపించా. వెంటనే అతను అపారమైన ప్రతిభ ఉన్నవాడని కృతి చెప్పింది." అని తెలిపింది.

"కొన్ని నెలల తర్వాత ఈ విషయం మా అమ్మకు చెప్పా. చాలా మంది తల్లులలాగే ఆమె కూడా కొంచెం సంకోచించింది. అప్పుడే నా సోదరి రంగంలోకి దిగింది. నేను స్టీబిన్‌ను కలిశాను.. అతని పాటలు కూడా విన్నాను.. చాలా ప్రతిభావంతుడు.. కష్టపడి పనిచేసేవాడని అమ్మతో చెప్పింది. ‍‍అలా తన మాటలతో అమ్మను మార్చేసింది.  అక్కడి నుండి అంతా సజావుగా జరిగిపోయింది" అని పంచుకుంది.  కాగా.. నుపుర్ సనన్- స్టీబిన్  పెళ్లి ఉదయపూర్‌ జరిగింది. ఈ వేడుకలకు సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)