Breaking News

రెమ్యునరేషన్ లేకుండానే స్టార్ హీరో కొత్త సినిమా!

Published on Mon, 08/18/2025 - 17:02

తమిళ స్టార్ హీరోల్లో అజిత్ ఒకడు. దళపతి విజయ్, రజినీకాంత్, సూర్య లాంటి వాళ్లతో పోలిస్తే ఇతడి మార్కెట్ చాలావరకు తమిళానికే పరిమితం. అయినా సరే వరస సినిమాలు చేస్తూ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ ఏడాది ఇప్పటికే అజిత్ నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా.. అవి రెండు  బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించాయి. ఇప్పుడు ఓ కొత్త మూవీని మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. కానీ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)

తనతో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' లాంటి క్రేజీ సినిమా తీసిన దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తోనే.. అజిత్ తన కొత్త మూవీ చేయబోతున్నాడు. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. ఇందులో 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ అని అంటున్నారు. అయితే ఈ సినిమా కోసం తొలుత ఓ నిర్మాణ సంస్థ ముందుకు రాగా.. అజిత్ రూ.200 కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేశారని టాక్. దీంతో సదరు సంస్థ స్వచ్ఛందంగా తప్పుకొందని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అజిత్ నటించిన పలు సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రాహుల్ అనే వ్యక్తి.. ఈ మూవీని నిర్మించేందుకు ముందుకు వచ్చాడని సమాచారం. అయితే రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఓ డీల్ మాట్లాడుకున్నాడని తెలుస్తోంది. రెగ్యులర్‌గా ఇచ్చే పారితోషికం బదులు ఓటీటీ, శాటిలైట్ హక్కుల్ని హీరో అజిత్ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్. ఇవన్నీ కూడా రీసెంట్‌గా ఫైనల్ అయ్యాయని.. 'AK64' పేరుతో మొదలయ్యే ఈ ప్రాజెక్ట్‌ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న 'కోర్ట్' దర్శకుడు.. అమ్మాయి ఎవరంటే?) 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)