Breaking News

ఓటీటీకి డేవిడ్ వార్నర్‌ చిత్రం... ఆ రోజు నుంచే స్ట్రీమింగ్!

Published on Wed, 04/30/2025 - 17:00

నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం రాబిన్‌హుడ్‌.  ఉగాది కానుకగా మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన చిత్రం.. ఆశించిన స్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టడంలో తేలిపోయింది. ఈ మూవీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం కెమియో పాత్రలో మెరిశారు. వార్నర్‌ కోసమైనా థియేటర్లకు వస్తారనుకున్నప్పటికీ అది కూడా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.

ఇప్పటికే ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవ్వడంతో ఈ మూవీ ఓటీటీకి ఎప్పుడొస్తుందా అభిమానులు ఎదురు చూస్తున్నారు. గతంలో మే 4న ఓటీటీ వస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. మరోవైపు వచ్చేనెల 10 నుంచి స్ట్రీమింగ్ కానుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ హక్కులను జీ5 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం తరహాలో ఓకేరోజు టీవీలతో పాటు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

రాబిన్‌హుడ్ కథేంటంటే..

'రాబిన్ హుడ్' విషయానికొస్తే.. రామ్ (నితిన్) ఓ అనాథ. అనాథ‍శ్రమాల కోసం రాబిన్ హుడ్ పేరుతో దొంగతనాలు చేస్తుంటాడు. కొన్ని కారణాల వల్ల ఓ సెక్యూరిటీ ఏజెన్సీలో చేరుతాడు. ఆస్ట‍్రేలియా నుంచి ఇండియాకు వచ్చిన నీరా (శ్రీలీల)కు సెక్యూరిటీగా ఉంటాడు. ఓరోజు నీరాని ఎవరో కిడ్నాప్ చేస్తారు. మరి రామ్, నీరాని ఎలా రక్షించాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)