Breaking News

యంగ్ హీరో నిఖిల్‌కి ఝలక్.. ట్వీట్ వైరల్

Published on Sun, 07/20/2025 - 15:55

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఎంతో బాగుందనే టాక్ వస్తే తప్పితే కొత్త సినిమా చూసేందుకు జనాలు థియేటర్లకు వెళ్లట్లేదు. అయితే ఇలా జరగడానికి మరో కారణం కూడా ఉంది. ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది. ఈ మేరకు ట్వీట్ చేయడంతో సదరు విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: సేనాని రూల్స్ మాట్లాడతారు.. పాటించరు)

మిగతా చోట్ల ఏమో గానీ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు చాలా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు కళ్లు చెదిరేలా ఉంటాయి. తాజాగా ఓ సినిమా చూసేందుకు థియేటర్‌కి వెళ్లిన నిఖిల్ కూడా తినుబండరాల ధరలు చూసి షాకయ్యాడు. తను కొన్న టికెట్ రేటు కంటే వీటికే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ట్విటర్‌లో చెప్పుకొచ్చాడు. కనీసం వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్లేందుకైనా అనుమతించాలని రిక్వెస్ట్ చేశాడు. ఈ విషయంలో డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ కాస్త దృష్టి పెడితే బాగుంటుందని, అప్పుడే జనాలు థియేటర్లకు వస్తారని అన్నాడు.

కొన్నిరోజుల ముందు నిర్మాత నాగవంశీ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదే విషయమై తన అనుభవాన్ని బయటపెట్టారు. తలో రెండు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్  ఏకంగా రూ.1000కి పైనే అయ్యాయని అన్నారు. దీంతో ఇప్పుడీ విషయం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతలు.. జనాలు థియేటర్లకు రావట్లేదని తెగ బాధపడిపోతున్నారు. అయితే కంటెంట్ విషయంలో దృష్టి పెట్టడంతో పాటు వీటి రేట్లు కూడా అందుబాటులో ఉంటేనే జనాలు కాస్తోకూస్తో రావడానికి ఆసక్తి చూపిస్తారు. లేదంటే మాత్రం పూర్తిగా ఓటీటీలకు అలవాటు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: 'జూనియర్' రెండు రోజుల కలెక్షన్ ఎంతంటే?)

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)