Breaking News

వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?

Published on Sat, 06/10/2023 - 17:31

మెగా ఇంట్లో మరో పెళ్లిసందడి షురూ అయింది. నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్- ఉపాసన దంపతులు కూడా హాజరయ్యారు. వీరితో పాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఉంగరాలు మార్చుకున్నారు. అయితే ఈ వేడుకలో అందరి కళ్లు నిహారిక కొణిదెలపైనే ఉన్నాయి.

(ఇది చదవండి: వెల్‌కమ్‌ టూ కొణిదెల ఫ్యామిలీ.. ఉపాసన ట్వీట్ వైరల్!)

హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన అన్న ఎంగేజ్‌మెంట్‌కు సోదరి నిహారిక సింగిల్‌గానే హాజరైంది. దీంతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. ఇప్పటికే నిహారిక విడాకులు తీసుకోబోతోందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో జొన్నలగడ్డ చైతన్య కనిపించకపోవడంతో మరోసారి డైవర్స్ ఖాయమేనంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే చైతన్య కూడా.. నిహారిక లేకుండానే తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వరుణ్- లావణ్య నిశ్చితార్థ వేడుకల్లో దిగిన ఫోటోల్లో నిహారిక సింగిల్‌గానే కనిపించడంతో రూమర్స్ మరోసారి ఊపందుకున్నాయి. 

(ఇది చదవండి: ప్రభాస్‌ 'ఆదిపురుష్' కోసం అల్లు అర్జున్‌ భారీ స్కెచ్‌)


 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)