Breaking News

విజయ్ విజయం.. పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు..!

Published on Mon, 05/04/2026 - 17:26

విజయ్.. విజిల్.. విజయం.. ఇప్పడంతా ఎక్కడ చూసినా ఈ మూడు పదాలే వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి సారే సెంచరీ కొట్టిన హీరో విజయ్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు విజయ్‌కు అభినందనలు తెలిపారు. మొదటిసారి పోటీ చేసిన విజయ్ ఏకంగా సీఎం రేసులో దూసుకెళ్తున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా తమిళనాడులో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించనుంది.

అయితే తమిళనాడులో విజయ్ విజయాన్ని ఏపీ రాజకీయాలతో ముడిపెడుతున్నారు. విజయ్‌ గెలుపుతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. తొలిసారి ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో(పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) గెలుపొందారు. అంతేకాకుండా మొదటిసారే సీఎం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానిపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీలో వచ్చే ఎన్నికల్లోనైనా సింగిల్‌గా పోటీ చేయాలని పవన్ కల్యాణ్‌ అభిమానులు కోరుకుంటున్నారు. విజయ్‌లాగే సింగిల్‌గా బరిలోకి దిగాలన్న డిమాండ్‌ పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో విజయ్ గెలుపు కాస్తా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలోనూ ఎవరితోనూ పొత్తులు లేకుండా బరిలోకి దిగాలనే డిమాండ్‌ వస్తే జనసేనాని ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే. సింగిల్‌గా పోటీ చేస్తేనే గుర్తింపు ఉంటుందని సగటు అభిమానులు, జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. 
 

Videos

TVK విజయ్ కు తెలుగు హీరోలు శుభాకాంక్షలు

MGR తర్వాత.. విజయ్ రికార్డ్ TVK విజయ దుందుభి

విజయకి జేజేలు అయ్య.. అమ్మ.. అన్న

సినిమా నుంచి CM వరకు.. విజయ్ ప్రస్థానం

రియల్ జన నాయగన్, పార్టీ ఎమ్మెల్యేకు కీలక ఆదేశాలు..

పొత్తుల్లేవు... జెండాలు మోసే కూలి కాదు విజయ్ తిరుగులేని ప్రస్థానం

Tamilnadu Results: MLA గా స్టాలిన్ ఓటమి...!

TVK సంచలనం. 50 ఏళ్ల పార్టీలను మట్టి కరిపించిన విజయ్

మా బావ గెలుపు చాలా ఆనందంగా ఉంది

దూసుకుపోతున్న విజయ్ మ్యాజిక్ ఫిగర్ దగ్గర TVK

Photos

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)

+5

తమిళనాడు ఎన్నికల ఫలితాల వేళ.. తిరుమలలో త్రిష ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

43 ఏళ్ల 'యంగ్' హీరోయిన్ త్రిష బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆహ్లాదకర వేళ.. బీచ్‌లో సందడి (ఫొటోలు)

+5

గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. దర్శకుడిగా ఫైట్ మాస్టర్ (ఫొటోలు)

+5

ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌..సెలబ్రిటీల సంద‌డి (ఫొటోలు)