సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు?.. ఉపాసనపై నెటిజన్ల ఫైర్!

Published on Tue, 11/18/2025 - 20:41

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ సతీమణిగా..మెగా కోడలిగా మాత్రమే కాకుండా ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తున్నారు.  అపోలో ఫౌండేషన్ వైస్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇటీవల ఐఐటీ హైదరాబాద్ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో చిట్‌చాట్‌ సందర్భంగా ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.

మీలో ఎంతమందికి పెళ్లి చేసుకోవాలని ఉంది? అని ఐఐటీ విద్యార్థులను ప్రశ్నించగా.. వచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు అమ్మాయిల కంటే యువకులే ఎక్కువమంది చేతులు ఎత్తారని ఉపాసన తెలిపింది. దీంతో మహిళలు కెరీర్‌పై ఎక్కువ దృష్టి సారించినట్లు అనిపించిందని ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఈ పరిణామం చూస్తుంటే సరికొత్త ప్రగతిశీల భారతదేశం అంటూ కితాబిచ్చింది. మీ దార్శనికతను నిర్దేశించుకోండి.. మీ లక్ష్యాలను నిర్వచించుకోండి.. మీ పాత్రను సొంతం చేసుకోండి. మిమ్మల్న ఎవరూ ఆపలేని వ్యక్తిగా మారండి అంటూ యువతను ఉద్దేశించి మాట్లాడింది.

అయితే ఉపాసన షేర్ చేసిన వీడియోలో మహిళల గురించి మాట్లాడింది. మీరు మీ కాళ్లపై ఆర్థికంగా నిలబడ్డాకే పిల్లలను ప్లాన్ చేసుకోవాలంటూ సూచించింది. అప్పటి వరకు ఒక్కరూ తమ అండాలను భద్రపరచుకోవాలంటూ ఉపాసన మాట్లాడారు. ఈ రోజు నేను నా సొంత కాళ్లపై నిలబడ్డానని.. నా సంపాదనతో ఆర్థికంగా ఎదిగానని తెలిపింది. ఈ ఆర్థిక భద్రతే నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచిందని..ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా తోడ్పడిందని పేర్కొంది. మీ జీవితంలో 30 ఏళ్లు వచ్చేసరికి కెరీర్‌లో నిలదొక్కుకోవాలని ఉపాసన వివరించింది. నీ కెరీర్‌లో విజన్‌, గోల్‌ సాధించడంలో సక్సెస్ అయితే మిమ్మల్ని ఇక ఎవరూ ఆపలేరంటూ మాట్లాడింది.

అయితే ఉపాసన కామెంట్స్‌ను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ బిజినెస్ కోసం యువతకు ఇలాంటి సలహాలు ఇస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మీ మాటలతో యువత తప్పుదారి పట్టేలా ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అపోలో ఫెర్టిలిటీ సెంటర్‌ ప్రమోట్‌ కోసం ఇలా చెప్పడం సరికాదని హితవు పలుకుతుకున్నారు. 30 ఏళ్ల తర్వాత పిల్లలను కనాలనే ఆసక్తి అమ్మాయిలకు ఉండదని ఉపాసనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.


కాగా.. ఉపాసన, రామ్ చరణ్‌కు దాదాపు పెళ్లయిన 12 ఏళ్లకు క్లీంకార జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే రెండోసారి ప్రెగ్నెన్సీని ప్రకటించారు. మెగాస్టార్ ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసన సీమంతం వేడుకను కూడా నిర్వహించారు. ఈ జంటకు 2023 జూన్‌లో  క్లిన్ కారా (Klinkaara) జన్మించగా.. రెండేళ్ల తర్వాత మరోసారి మరో బిడ్డకు జన్మనివనున్నారు. 
 

 

Videos

KSR: అన్నదాతకు బాబు షాక్ జగన్‌పై దుష్ప్రచారం

జగన్ రాకతో.. దద్దరిల్లిన హైదరాబాద్

బెంగళూరు హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్ లో జగన్ క్రేజ్..

KTRకు బిగ్ షాక్.. CBI చేతికి ఫార్ములా ఈ-రేసు కేసు

Watch Live: CBI కోర్టుకు YS జగన్

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

Photos

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?