Breaking News

నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌పై తీవ్ర అభ్యంతరం.. ఇకపై తప్పు జరగదన్న మేకర్స్!

Published on Tue, 09/03/2024 - 14:49

ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సరికొత్త వెబ్ సిరీస్ 'ఐసీ 814: కాందహార్ హైజాక్'. ఈ సిరీస్‌లో బాలీవుడ్ నటుడు విజయ్‌ వర్మ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సిరీస్‌లోని కొన్ని సన్నివేశాలపై పెద్దఎత్తున వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే సిరీస్‌పై మండిపడ్డ కేంద్రం వివరణ ఇవ్వాలంటూ మేకర్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ హెడ్‌ మోనికా షెర్గిల్‌ కేంద్ర, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారుల ముందు హాజరయ్యారు.

ఇకపై కంటెంట్ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కంటెంట్‌ను ప్రసారం చేస్తామని హామీ ఇ‍చ్చారు. చిన్నారులకు సంబంధించిన కంటెంట్‌ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటామని ఓటీటీ సంస్థ అంగీకరించింది.

అసలేంటీ వివాదం..

1999లో భారత విమానాన్ని పాకిస్థాన్‌ ఉగ్రవాదులు హైజాక్‌ చేసిన సంఘటన ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌లో హైజాకర్ల పేర్లను శంకర్‌, భోలా అని మార్చి చూపించడమే కాకుండా.. వారిని మానవత్వమున్న వ్యక్తులుగా చిత్రీకరించారు. దీంతో హైజాకర్లు తమ మత గుర్తింపు దాచిపెట్టేందుకే మారుపేర్లు పెట్టుకున్నారని.. ఈ సిరీస్‌ రూపొందించిన వారు కావాలనే ఆ పేర్లనే క్యారెక్టర్స్‌కు పెట్టారని భాజపా ఐటీ విభాగం చీఫ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం దీన్ని తీవ్రంగా పరిగణించి సమన్లు జారీ చేసింది.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)