Breaking News

కన్నడ సినిమా రైట్స్‌ కోసం నెట్‌ఫ్లిక్స్‌.. ఫస్ట్‌ మూవీ ఇదేనా..?

Published on Fri, 11/01/2024 - 13:32

కన్నడ హీరో శ్రీ మురళి నటించిన తాజా చిత్రం బఘీర. దీపావళీ కానుకగా అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదలైంది. అయితే, మొదటిసారి ఏ కన్నడ సినిమాకు దక్కిన క్రేజ్‌ ఈ చిత్రానికి దక్కిందని తెలుస్తుంది.  డా. సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో నిర్మించారు. అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కథ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఇవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

'బఘీర' కథను డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ అందించడంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా రీచ్‌ అయింది. దీంతో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ కూడా డిజిటల్‌ రైట్స్‌ తీసుకునేందుకు ఆసక్తి కనపరిచిందని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఇంతవరకు ఏ కన్నడ చిత్రాన్ని డైరెక్ట్‌గా ఓటీటీ రైట్స్‌ను దక్కించుకోలేదు. అక్కడ పెద్దగా మార్కెట్‌ లేకపోవడంతో నెట్‌ఫ్లిక్స్‌ ఆసక్తి కనపరచలేదని సమాచారం. అయితే, ఇప్పుడు బఘీర హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్నట్లు కన్నడ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన కాంతార సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, కేవలం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.  ఇతర భాషలకు సంబంధించిన వర్షన్స్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో రన్‌ అవుతున్నాయి. కన్నడ సినిమాలు ఒకప్పుడు ఇతర భాషలలో విడుదల కాకపోవడంతో ఓటీటీ సంస్థలు పెద్దగా ఆ ఇండస్ట్రీపై ఆసక్తి చూపలేదు. అయితే, కేజీఎఫ్‌ తర్వాత వారి సినిమాల మార్కెట్‌ పెరిగింది. దీంతో పాన్‌ ఇండియా రేంజ్‌లో కన్నడ సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ మార్కెట్‌ మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. అందుకే బఘీర సినిమా డిజిటల్‌ రైట్స్‌ తొలిసారి నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుందని కన్నడలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)