Breaking News

కలల ప్రయాణం

Published on Wed, 02/25/2026 - 00:38

తమిళనాడులోని ఒక చిన్న పట్టణానికి చెందిన శెన్బాకి దక్షిణ కొరియాకు వెళ్లాలన్నది పెద్ద కల. ఆ కల నిజమవుతున్న ప్రయాణాన్ని చూపించే ‘మేడ్‌ ఇన్‌ కొరియా’ చిత్రం మార్చి 12న నెట్‌ ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ‘స్క్విడ్‌ గేమ్‌’ ఫేమ్‌ దక్షిణ కొరియా నటుడుపార్క్‌ హ్యే–జిన్,నో హో–జిన్‌ ఈ సినిమాలోని ప్రధానపాత్రల్లో నటించారు. ఆర్‌ఏ కార్తీక్‌ దర్శకత్వంలో రైజ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మించింది.

ఈ చిత్రవిశేషాల గురించి  ప్రియాంక చెబుతూ– ‘‘మేడ్‌ ఇన్‌ కొరియా’  కథ విన్నప్పుడే శెన్బాపాత్రతో నాకు బలమైన అనుబంధం ఏర్పడింది. ఇంత అద్భుతమైనపాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘కొరియన్, తమిళ సంస్కృతుల మధ్య ఉన్న చారిత్రక అనుబంధాలు నాకు ఎంతో ఆసక్తిని కలిగించాయి. ఆ స్ఫూర్తితోనే ఈ కథ తయారు చేశాను. మనసుల్ని హత్తుకునే స్లైస్‌ ఆఫ్‌ లైఫ్‌ చిత్రం ఇది.

భాషల్ని దాటి ప్రపంచ సంస్కృతులను కలుపుతున్న కథలను ప్రోత్సహించిన నెట్‌ఫ్లిక్స్‌కు థ్యాంక్స్‌’’ అని పేర్కొన్నారు ఆర్‌ఏ కార్తీక్‌. ‘‘దక్షిణాది కథలపై మా దృష్టిని బలోపేతం చేస్తూ, స్థానిక సంస్కృతిలోపాతుకుపోయిన కథలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మోనికా షెర్గిల్‌.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)