Breaking News

ఎలన్ మస్క్ ఎరికేనా మీకు.. ఆ రాకెట్ ఇదే.. నవ్వులు పూయిస్తోన్న లేటేస్ట్ ప్రోమో!

Published on Mon, 10/20/2025 - 14:54

టాలీవుడ్ హీరో నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న తాజా చిత్రం అనగనగా ఒక రాజు(Anaganaga Oka Raju). ఈ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ వచ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా దాదాపు రెండు నెలలకు పైగా సమయం ఉన్న‍ప్పటికీ ఛాన్స్‌ వస్తే చాలు ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నారు మేకర్స్. ఇటీవలే దసరా సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది.

తాజాగా ఇవాళ దివాళీ కావడంతో మరో ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. త్వరలోనే ఫస్ట్ సాంగ్‌ను కూడా విడుదల చేస్తామని అప్‌డేట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రోమోలో పటాకుల దుకాణంలో నవీన్ పొలిశెట్టి హీరోగా చేసిన హంగామా తెగ నవ్వులు తెప్పిస్తోంది. అరే హ్యాపీ దివాళీ అన్న.. ఏం కావాలి అన్న.. ఏమీ దొరుకుతాయి ఇక్కడ అని కస్టమర్‌ అనగానే.. పట్టు చీరలు, శిల్క్ శారీలు అన్నీ ఉన్నాయి.. పటాకాయల షాపుకొచ్చి పట్టుచీరలు దొరుతుతాయా అన్నా అంటూ నవీన్ నవ్వులు పూయించాడు. ఎల్లన్న.. అంటే ఎలన్ మస్క్ ఎరికేనా నీకు.. మార్స్‌లో నీళ్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి పంపించిన రాకెట్స్‌ ఇవే.. సేమ్ పీస్.. అందుకే వారంటీ కోసం మస్క్ ఫోటో కూడా వేయించా.. మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా ఆయనకు ఫోన్ చేయుర్రి.. మనం నీళ్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి వాచ్‌మెన్‌ను పంపిస్తాం.. ఈ డబ్బులు ఉన్నోళ్లు ఏంది రాకెట్స్ పంపిస్తరు.. పైసలు ఉన్నోళ్ల పైత్యం లే.. అంటూ ప్రోమో ఫుల్ కామెడీతో అలరిస్తోంది.

కాగా.. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. మారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నారు. 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)