Breaking News

ఓటీటీలో 'నవీన్‌ చంద్ర' క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా

Published on Thu, 06/12/2025 - 11:22

టాలీవుడ్ హీరో నవీన్‌ చంద్ర (Naveen Chandra), రాశీసింగ్‌ (Rashi Singh) జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్‌ చిత్రం 'బ్లైండ్ స్పాట్'(Blind Spot). తాజాగా ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటన వచ్చేసింది.  మే 9న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులకు కనెక్ట్‌ కాకపోయినప్పటికీ క్రైమ్ కథలను ఇష్టపడే వారిని మెప్పించింది. ఈ సినిమాకు రాకేశ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మ్యాంగో మాస్ మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మించారు. ఈ మూవీలో  ఆలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ తదితరులు నటించారు.

'బ్లైండ్ స్పాట్' చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల కానున్నట్లు ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. జూన్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని అందులో తెలిపారు. ఈ చిత్రంలో ఒక పాత్రే రెండు విభిన్న కోణాల్లో చాలా  ఆసక్తిగా దర్శకుడు చూపారు. కథ రొటీన్‌గానే ఉన్నప్పటికీ  క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అక్కడక్కడ పండుతుంది. ఓటీటీలో చూడతగిన సినిమానే అని చెప్పవచ్చు.

కథ ఏంటి..?
హైదరాబాద్‌కు చెందిన మెన్ జైరాం (రవి వర్మ) ప్రముఖ వ్యాపారవేత్తగా ఉంటాడు. అయతే, తన భార్య దివ్య (రాశీ సింగ్)తో తరుచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఆమె అనుమానాస్పదంగా మరణిస్తుంది. అది హత్య లేక ఆత్మహత్యనా అనేది అంతుపట్టదు. దివ్య మరణించిన విషయాన్ని ఆ ఇంటి పనిమనిషి పోలీసులకు సమాచారం ఇస్తుంది. అప్పుడు ఆ ఏరియా పోలీస్ విక్రమ్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది.  ఆమెది ఆత్మహత్య కాదు హత్య అని విక్రమ్‌ చెబుతాడు. మరి ఆ హత్యకు కారణాలు ఏంటి..? ఎవరు చేశారు..? ఆమెను చంపే అంత అవసరం ఎందుకు వచ్చింది..? ఇంట్లో ఉన్నవారితోనే ప్లాన్‌ వేశారా..? దివ్య మానసిక పరిస్థితి  ఎలా ఉండేది? చివరికి హత్య చేసిన వారిని పోలీసులు ఎలా పట్టుకున్నారు..? అనేది తెలియాలంటే 'బ్లైండ్ స్పాట్' చూడాల్సిందే.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)