Breaking News

మాట తూలి.. ఇప్పుడు సారీ చెప్పిన నవదీప్

Published on Tue, 08/26/2025 - 15:21

బిగ్‌బాస్ షో మరో రెండు వారాల్లో మొదలవుతుంది. ఈసారి సామాన్యులకు ఎక్కువమందికి అవకాశం కల్పించేందుకు అగ్నిపరీక్ష పేరుతో ఓ షో ప్లాన్ చేశారు. గత నాలుగైదు రోజుల నుంచి పలు గేమ్స్ పెడుతూ టాప్-15 కంటెస్టెంట్స్‌ని ఎంపిక చేశారు. అయితే సోమవారం ఎపిసోడ్‌లో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న నవదీప్.. ఓ లేడీ కంటెస్టెంట్‌పై మాట తూలాడు. ఈ విషయమై విమర్శలు రావడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పుకొచ్చాడు.

సోమవారం టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్‌లో కల్కి, షాకీబ్ అనే కంటెస్టెంట్స్ మధ్య చిన్న గేమ్ పెట్టారు. ఎవరికైనా ఫోన్ చేసి ఆన్‌లైన్ ద్వారా  డబ్బులు వేయమని చెప్పారు. అయితే ఈ పోటీలో కల్కికి గేమ్ గురించి క్లియర్‌గా చెప్పారు. షాకీబ్‌కి మాత్రం సరిగా వివరించలేదు. దీంతో అతడికి తక్కువ డబ్బులు మాత్రమే పడ్డాయి. ఇది ఎవరికైనా అన్ ఫెయిర్ అనిపించిందా? అని కూర్చున్న కంటెస్టెంట్స్‌ని నవదీప్ అడగ్గా.. శ్రీజ చేయి ఎత్తింది.

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌తో హాలీవుడ్‌ పవర్‌ హౌస్‌.. బిగ్‌ ప్లాన్‌ రెడీ)

దీంతో శ్రీజని నవదీప్ స్టేజీపై రమ్మన్నాడు. అన్ ఫెయిర్ అని ఎందుకు అనిపించింది? అని ఈమెని అడగ్గా.. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బుంటే వారే గెలుస్తారని కల్కికి వివరంగా చెప్పారు, కానీ, అతడికి ఆ మాట చెప్పలేదని ధైర్యంగా అనేసింది. దాంతో నవదీప్‌ కోప్పడ్డాడు. నువ్వు అతిగా ఆలోచించొద్దు. బిగ్‌బాస్‌ అనేది చాలా భాషల్లో ఎన్నో సీజన్లు జరిగాయి. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చి అన్‌ఫెయిర్‌ అని చెప్పడానికి.. నీకంత సీన్‌ లేదు. ఇంకోసారి ఇలా చేయకు అంటూ ఆమెను చులకన చేసి మాట్లాడాడు.

అయితే 'ఊరి నుంచి వచ్చావ్' అని నవదీప్ కామెంట్ చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో ఇప్పుడు తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేశాడు. ''ఊరి నుంచి వచ్చి' అన్న మాటకు ఫీలైన సున్నితమైన మనసులకు ప్రేమలో సారీ చెబుతున్నా. కుదిరితే క్షమించండి. ఐ లవ్యూ' అని నవదీప్ రాసుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: ‘బిగ్‌బాస్‌’లో ప్రేమాయణం.. పెళ్లి చేసుకున్న జంటలివే)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)