Breaking News

ఎన్టీఆర్ బావమరిది ఫస్ట్ సినిమా.. ఇన్నాళ్లకు మోక్షం

Published on Sat, 05/31/2025 - 15:43

జూ. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్.. ఇప్పటికే హీరోగా మూడు సినిమాలు చేశాడు. అవే 'మ్యాడ్', 'మ్యాడ్ స్క్వేర్', 'ఆయ్'. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాలు మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ముగ్గురు హీరోల 'భైరవం' తొలిరోజు కలెక్షన్స్)

'శ్రీశ్రీశ్రీ రాజావారు' పేరుతో తీసిన ఈ సినిమాలో నార్నే నితిన్‪‌తో పాటు రావు రమేశ్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'శతమానం భవతి' ఫేమ్ సతీశ్ వేగ్నేశ దర్శకుడు. తాజాగా రిలీజైన ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ పల్లెటూరి కుర్రాడు. ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాటు వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరకు ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది.

విజువల్స్ చూస్తుంటే రిచ్‌గా ఉన్నాయి గానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీమ్ అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్లకే తెలియాలి. వచ్చే వారం థియేటర్లలో కమల్ హాసన్ 'థగ్ లైఫ్' మూవీ రిలీజ్ కానుంది. దీనిపై కాస్తోకూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీపడి 'రాజావారు' మూవీ ఏం చేస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)