Breaking News

టాలీవుడ్ హీరో పెళ్లి సందడి.. ఎన్టీఆర్‌ బామ్మర్ది మ్యారేజ్ డేట్‌ ఫిక్స్!

Published on Wed, 10/08/2025 - 16:56

ఏడాది మ్యాడ్ స్క్వేర్ మూవీతో అభిమానులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో నార్నే నితిన్. వరుసకు మన యంగ్ టైగర్ బామ్మర్ది అయిన నార్నే నితిన్.. శివానీ అనే అమ్మాయితో గతేడాది ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు తన కుమారులు అభయ్, భార్గవ్‌లతో కలిసి వేడుకలో సందడి చేశారు. నిశ్చితార్థానికి హీరో కల్యాణ్ రామ్, వెంకటేశ్‌ కూడా హాజరయ్యారు.

తాజాగా వీరిద్దరి పెళ్లికి సంబంధించిన క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నార్నే నితిన్- శివాని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి పెళ్లి తేదీ ఫిక్స్అయినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక అక్టోబర్ 10న గ్రాండ్గా జరగనుందని టాక్. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం ఘనంగా జరగనుందట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా.. ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌చంద్రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన శివానితో నేడు నవంబర్‌ 3న నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్‌లో ఇరువురి కుటుంబ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం గ్రాండ్గా నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో యువతి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది. హీరో వెంకటేష్‌ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట. శివానీ టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్‌కు కజిన్ డాటర్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్ స్వరూప దంపతులు. ప్రముఖ పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన నార్నే శ్రీనివాసరావు తనయుడే నార్నే నితిన్‌. 2023లో మ్యాడ్‌ సినిమాతో ఎన్టీఆర్‌కు బావ మరిదిగా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చాడు. ఏడాది మ్యాడ్ స్క్వేర్మూవీతో ప్రేక్షకులను మెప్పించారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)