Breaking News

సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?

Published on Tue, 12/09/2025 - 18:45

సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్‌ వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్‌ సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్‌ గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్‌, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్‌ తేదీలు వెల్లడించారు.

తాజాగా మరో టాలీవుడ్‌ హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది. జనవరి 14న థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్‌ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.  ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్‌ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. 

కాగా.. ఈ చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్‌లో 37వ చిత్రంగా నిలవనుంది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)