Breaking News

ఓటీటీలోకి వచ్చేసిన ఆ తెలుగు సినిమాలు

Published on Fri, 09/01/2023 - 11:21

విజయ్-సమంత నటించిన 'ఖుషి' థియేటర్లలోకి వచ్చేసింది. ఆలోవర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ వారం ఓటీటీలో పెద్దగా చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు రిలీజ్ కాలేదు. ఓ డబ్బింగ్ మూవీ, వెబ్ సిరీస్ మాత్రమే విడుదలయ్యాయి. అలాంటిది ఓ రెండు తెలుగు మూవీస్.. ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలేంటి? ఎందులో రిలీజ్ అయ్యాయి?

ఆ ఓటీటీలో 'ఉస్తాద్'
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీసింహా. ఇప్పుడిప్పుడు హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇతడు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్'. ఆగస్టు 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది. ఓ సాధారణ యువకుడు.. పైలట్ ఎలా అయ్యాడు? మధ్య ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తీశారు. స్టోరీ బాగానే ఉన్నా.. కథలో కాస్త ల్యాగ్ ఉండటం వల్ల థియేటర్లలో సరిగా ఆడలేదు. ఓటీటీలో కాబట్టి చూసేయొచ్చు.

(ఇదీ చదవండి: 'ఖుషి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)

ఆ ఓటీటీలో 'నారాయణ & కో'
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'తో గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ కోమకుల హీరోగా నటించి నిర్మించిన సినిమా 'నారాయణ & కో'. ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. జూన్ 30న థియేటర్లలో రిలీజైంది. దాదాపు రెండు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అనుకోకుండా ఎదురైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఓ కుటుంబం చేసిన తింగరి పనులే 'నారాయణ & కో' సినిమా మెయిన్ స్టోరీ.

వీటితోపాటు 'డీడీ రిటర్న్స్' అనే తమిళ డబ్బింగ్ చిత్రం, 'స్కామ్ 2003: ఏ తెల్గీ స్టోరీ' అనే తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్.. తాజాగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చేశాయి. మరి ఇంకెందుకు లేటు. ఇంట్రెస్ట్ ఉంటే ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌పై ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్.. కానీ?)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)