Breaking News

నాని 'హిట్‌ 3' వచ్చేది ఆ ఓటీటీలోనే..

Published on Thu, 05/01/2025 - 13:36

హీరో నాని (Nani) స్పీడుమీదున్నాడు. హీరోగా, నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నాడు. దసరా, హాయ్‌ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హిట్లు అందుకుంటున్న ఈ హీరో.. నిర్మాతగా కోర్ట్‌ చిత్రంతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్‌: ద థర్డ్‌ కేస్‌ మూవీ (HIT: The Third Case) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హిట్‌ 3కి పాజిటివ్‌ టాక్‌
మే1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. హిట్‌ 1, 2 కంటే కూడా ఈ మూవీలో వయొలెన్స్‌ మూడు రెట్లు ఎక్కువగా ఉంది. యాక్షన్‌ సినిమాలు ఇష్టపడేవారికి హిట్‌ 3 బాగా ఎక్కేసిందట! ఈ టాక్‌ చూస్తుంటే నాని బ్లాక్‌బస్టర్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. హిట్‌ 3 సినిమాలో నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించారు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహించాడు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందించాడు. నాని, ప్రశాంతి తిపిర్నేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 

ఏ ఓటీటీలో అంటే?
ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. ఏకంగా రూ.54 కోట్లు పెట్టి ఈ హక్కుల్ని సొంతం చేసుకుందని టాక్‌. థియేటర్‌లో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన మే చివరి వారం, లేదా జూన్‌ మొదటివారంలో హిట్‌ 3 ఓటీటీలో వచ్చే అవకాశాలున్నాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ ప్రవాహం వారాల తరబడి కొనసాగితే మాత్రం ఓటీటీ రిలీజ్‌ ఆలస్యమయ్యే ఆస్కారం ఉంది.

హిట్‌ 3 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)