Breaking News

హాయ్‌ నాన్న బ్లాక్‌బస్టర్‌ హిట్‌.. మొత్తం కలెక్షన్స్‌ ఎంతంటే?

Published on Mon, 01/01/2024 - 14:11

నేచురల్‌ స్టార్‌ నాని బాక్సాఫీస్‌ లెక్కల కన్నా ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడమే ముఖ్యమని ఫీలవుతుంటాడు. అయితే తను ఎంచుకునే వైవిధ్యమైన కంటెంట్‌కు కొన్నిసార్లు బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లే వస్తుంటాయి. అది దసరా సినిమాతో నిరూపితమైంది. తాజాగా హాయ్‌ నాన్నతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఖాతాలో వేసుకున్నాడీ హీరో.

డిసెంబర్‌ 7న రిలీజైన హాయ్‌ నాన్న
నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మోహన్‌ చెరుకూరి, డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించారు. ఈ నెల 7న రిలీజైన ఈ చిత్రానికి పాజిటివ్‌ స్పందన లభించింది. ఫలితంగా మంచి కలెక్షన్లు రాబట్టింది. అయితే డిసెంబర్‌ 22న విడుదలైన సలార్‌ హాయ్‌ నాన్న మూవీకి గట్టి పోటీనిచ్చింది.

ఇప్పటివరకు వచ్చిందెంతంటే?
సోషల్‌ మీడియాలో అంత హడావుడి లేకపోయినా సైలెంట్‌గా బాగానే రాబట్టింది. తాజాగా ఈ సినిమా అధికారిక కలెక్షన్లను ప్రకటించింది చిత్రయూనిట్‌. హాయ్‌ నాన్న ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టిందని తెలిపింది. ఇక ఈ మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీ రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 4 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. మరి థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్‌ అయినవారు ఓటీటీలో చూసి ఆనందించండి.

చదవండి: తెలుగులో అదే చివరి సినిమా.. హీరోయిన్‌ నుంచి ప్రాధాన్యత లేని పాత్రల్లో..

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి