Breaking News

తెలుగు మాస్‌ సాంగ్‌తో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం.. వీడియో వైరల్

Published on Sun, 04/19/2026 - 07:46

ఐపీఎల్ సందడి మామూలుగా ఉండదు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌ అంటే తెలుగువారికి పూనకాలే. అది కూడా హైదరాబాద్‌లో మ్యాచ్ జరిగితే ఆ జోష్ ఎలా ఉంటుంది. అంతేకాకుండా టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోని ఉన్న సీఎస్‌కే టీమ్‌తో మ్యాచ్ అంటే క్రేజ్ వేరే లెవెల్. ఈ క్రేజీ మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. శనివారం ఉప్పల్ ‍స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌  వర్సెస్‌ సీఎస్కే తలపడగా.. హైదరాబాద్‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అయితే ఈ మ్యాచ్‌లో తెలుగు సాంగ్స్ క్రికెట్‌ ప్రియులను ఊర్రూతలుగించాయి. ముఖ్యంగా నాని మూవీ ప్యారడైజ్ సాంగ్‌ స్డేడియాన్ని ఊపేసింది. ఈ మ్యాచ్‌ మధ్యలో పొట్టు పొట్టు ఆకలుంది.. ఆయా షేర్ అనే పాటను ప్లే చేశారు. ఈ పాటకు ఫ్యాన్స్‌కు ఏకంగా పూనకాలతో ఊగిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ప్యారడైజ్ టీమ్‌ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఉప్పల్ రోర్స్ విత్ ఆయా షేర్ మానియా అంటూ వీడియోను పంచుకుంది. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో కేవలం తెలుగులోనే వంద మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్తోంది. 

కాగా.. నాని హీరోగా వస్తోన్న ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన దసరా సూపర్‌హిట్‌గా నిలిచింది. మరోసారి వీరిద్దరు కలిసి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 21న రిలీజ్ కానుంది. 

 

Videos

ఇజ్రాయెల్ పై ట్రంప్ ప్రశంసల వర్షం

పెళ్లి తర్వాత వన్స్ మోర్..!

తెలంగాణలో రెడ్ బుక్ అంటే తాట తీస్తాం.. అబ్బా కొడుకులకు జర్నలిస్టులు వార్నింగ్

అక్షయ తృతీయ ఆఫర్స్.. కిక్కిరిసిన బంగారం షాపులు

ఓటర్ జాబితాలో అక్రమాలు.. పరకాల సంచలన వ్యాఖ్యలు

కాపు టైగర్ దీక్ష అంటే ఆ మాత్రం ఉండాలి..

జర్నలిస్ట్ KVRపై కేసులు.. బాబును ఏకిపారేసిన జగన్

ప్రళయ కాలం వచ్చేసింది! మానవాళికి ఆఖరి రోజా

నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. నేను శ్రీ రాముడిని అలా అనలేదు

KGF డైలాగుతో దడదడలాడించిన శ్యామల

Photos

+5

ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా గోవా బ్యూటీ..! (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఏప్రిల్ 19-26)

+5

చిరుజల్లుల చల్లదనం (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆభరణాల షోరూం ప్రారంభించిన నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కంట్రీ క్లబ్‌లో గ్రాండ్‌గా ఫ్యాషన్‌ షో (ఫొటోలు)

+5

SRH Vs CSK Match : సన్‌రైజర్స్‌ను చీర్‌ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్‌ (ఫొటోలు)

+5

నయన్ ఫ్యామిలీ టైమ్.. కొడుకులతో కలిసి (ఫొటోలు)

+5

ముంబైలో INCA అవార్డ్స్‌.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ఫోటోలు)

+5

సిద్ధార్థ్‌ బర్త్‌డే.. స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేసిన అదితి రావు హైదరి (ఫొటోలు)