Breaking News

భారీ ధరకు హాయ్‌ నాన్న డిజిటల్‌ రైట్స్‌.. ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే!

Published on Fri, 12/08/2023 - 18:06

ఈ మధ్య లవ్‌స్టోరీ, యాక్షన్‌ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో సినీప్రియులకు మంచి ఎమోషనల్‌ టచ్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది హాయ్‌ నాన్న మూవీ. నాని, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన ఈ సినిమాలో బేబి కియారా ఖన్నా కీలక పాత్రలో నటించింది. మోహన్‌ చెరుకూరి, డా.విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగా కనెక్ట్‌ అవుతున్నారు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆరా తీస్తున్నారు అభిమానులు. ఈ చిత్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.37 కోట్లు పెట్టి నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమాను చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలోకి తీసుకుచ్చే ఆలోచనలు చేయడం లేదట! వచ్చే ఏడాది సంక్రాంతి సమయంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ చేస్తారట!

హాయ్‌ నాన్న కథేంటంటే..
ముంబైకి చెందిన విరాజ్‌(నాని) ఓ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌. అతడికి తన కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. విరాజ్‌ ప్రతిరోజు హీరో కథలు చెప్పడం.. ఆ హీరో పాత్రను నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ రోజు అమ్మ కథ చెప్పమంటుంది. కానీ విరాజ్‌ చెప్పడు. కూతురు ఇలాగే మారాం చేయడంతో ఒకరోజు విరాజ్‌ అమ్మ కథ చెప్తాడు. అసలు మహి తల్లి ఎవరు? ఎందుకు ఆమె వీరితో కలిసి ఉండట్లేదు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది థియేటర్స్‌లో చూసి తెలుసుకోవాల్సిందే!

చదవండి: 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి