Breaking News

‍'వారసుడు' సినిమా చేసి బాధపడ్డాను: నందిని రాయ్

Published on Wed, 05/28/2025 - 07:49

బిగ్‌బాస్ 2వ సీజన్‌లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న నందిని రాయ్.. తర్వాత చాలా సినిమాల్లో నటించింది. కానీ దళపతి విజయ్ 'వారసుడు' చేసి మాత్రం తప్పు చేశానని అంటోంది. అందుకు గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది. మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈమె.. మిస్ ఆంధ్రప్రదేశ్‌గానూ నిలిచింది. ప్రస్తుతం అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. ఎక్కువగా బోల్డ్ రోల్స్ చేస్తూ ఫేమస్ అయింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)

వారసుడు చిత్రంలో నటించడం గురించి మాట్లాడిన నందిని రాయ్.. 'విజయ్ సర్ 'వారసుడు'లో నాది చిన్న రోల్ కాదు. నెరేషన్ ఇచ్చినప్పుడు ప్రకాశ్ రాజ్ కూతురు పాత్ర, శ్రీకాంత్‌ని రెచ్చగొట్టి అతడి కుటుంబాన్ని విడదీయాలి. ఇదంతా షూటింగ్ కూడా చేశారు. కానీ ఎడిటింగ్‌లో సీన్లన్నీ తీసేశారు. మొత్తంగా చూస్తే మూవీలో 2 నిమిషాలు కూడా లేదు నా పాత్ర. రిలీజ్ తర్వాత ఎందుకు ఈ సినిమా చేశావ్ అనే ప్రశ్నలు వచ్చాయి. ఈ మూవీ చేసినందుకు మాత్రం బాధపడ్డాను. ఇదంతా నేను ఊహించలేదు. ఆ చిత్రం వల్ల నాపై నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చింది. వారసుడు తరహా పాత్రలు మళ్లీ చేయను' అని చెప్పుకొచ్చింది.

2011లో '040' అనే తెలుగు సినిమాతో నందిని రాయ్ నటిగా మారింది. సుధీర్ బాబు 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రంలో హీరోయిన్ రోల్ పడింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. సిల్లీ ఫెలోస్, శివరంజని, సీఎస్ఐ సనాతన్, భాగ్ సాలే తదితర చిత్రాలైతే చేసింది గానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చింది.

అలానే తన అనారోగ్య సమస్యల గురించి కూడా నందిని రాయ్ బయటపెట్టింది. గతంలో స్నేహితులతో కలిసి గోవా వెళ్లినప్పుడు బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నా. నీటిలో ఒక గుడ్డ.. నా కాలికి పదేపదే తగులుతూ ఉంది. ఎన్నిసార్లు వదిలినా నా కాలికి చుట్టుకుంది. తీరా తీసి చూస్తే అందులో ఎవరికో చేతబడి చేసి రెండు బొమ్మలు, సూదులు గుచ్చి ఉన్నాయి. పువ్వులు, ఎవరిదో జుట్టు కూడా ఉంది. ఆ షాక్‌తో చాలా డిస్టర్బ్ అయ్యాను. మూడు రోజులు జ్వరంతో బాధపడ్డాను. దాని తర్వాత కొన్ని రోజులు అనారోగ్య సమస్యలు వేధించాయి. చావు మీద భయం వచ్చింది. దీంతో ఇంట్లో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అప్పుడు సినిమా ఆఫర్స్ వచ్చినా అనారోగ్యం వల్ల చేయలేకపోయాయను. ఆ మూవీస్ చేసుంటే నాకు సక్సెస్ వచ్చి ఉండేదేమో అని భావోద్వేగానికి గురైంది.

(ఇదీ చదవండి: నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?.. మంచు విష్ణు ట్వీట్ వైరల్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)