Breaking News

అనుకున్నదే అయింది.. అఖండ-2 వాయిదా.. పవన్ కల్యాణ్ కోసమేనా?

Published on Thu, 08/28/2025 - 18:51

బాలకృష్ణ- బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'అఖండ'. 2021 డిసెంబరులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో బాలయ్య మాస్‌ యాక్షన్ సీన్స్‌ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. మంచు కొండల్లో ఆయన్ని పరిచయం చేస్తూ.. ఓ ఫైట్ సీన్ చూపించారు.

అయితే అఖండ-2 ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్‌ చెప్పారు మేకర్స్‌. ఈ మూవీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్‌ 25న అఖండ-2 రావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోస్ట్‌ చేసింది. అయితే ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకు వాయిదా వేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరింత వీఎఫ్‌ఎక్స్‌, రీ రికార్డింగ్‌ మెరుగులు దిద్దేందుకే పోస్ట్‌పోన్‌ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనతో బాలయ్య బాబు అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 

(ఇది చదవండి: బాలకృష్ణ 'అఖండ 2' టీజర్ రిలీజ్.. ఈసారి కూడా)

అయితే గతంలోనే అఖండ-2 వాయిదా పడనుందని వార్తలొచ్చాయి. ఎందుకంటే అదే రోజున పవన్ కల్యాణ్ నటించిన ఓజీ కూడా రిలీజ్ కానుంది. ఆ కారణం వల్లే బాలయ్య సినిమాను వాయిదా వేయనున్నారని టాక్ వినిపించింది. అందరూ ఊహించనట్లుగానే ఇవాల్టి ప్రకటనతో అదే నిజమైంది. అఖండ-2 తప్పుకోవడంతో పవన్‌ కల్యాణ్‌ ఓజీకి బాక్సాఫీస్ వద్ద రిలీఫ్ లభించింది. లేకపోతే బాలయ్యతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వచ్చేది. మరోవైపు ఓజీ కోసమే ఈ మూవీని వాయిదా వేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా.. అఖండ- 2 చిత్రాన్ని బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా సంయుక్త నటిస్తోంది.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)