Breaking News

నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: నాగార్జున

Published on Mon, 06/23/2025 - 06:56

'కుబేర' సినిమా వచ్చింది. హిట్ టాక్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఎక్కువమంది హీరోగా ధనుష్ గురించి మాట్లాడుకుంటున్నారు. అలానే కీలక పాత్రలో కనిపించిన నాగార్జునని కూడా ప్రశంసిస్తున్నారు. అయితే నాగ్.. ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఒకలా మాట్లాడి తర్వాత మరోలా మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఇవి నాగ్ చెవిన కూడా పడ్డాయి. ఇప్పుడు తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

'కుబేర' సక్సెస్ మీట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో మాట్లాడిన నాగార్జున.. 'సినిమా విడుదలకు ముందు శేఖర్ కమ్ముల సినిమా అన్నాడు. ఇప్పుడేమో నా సినిమా అంటున్నాడు అని కొన్ని మీమ్స్ కనిపించాయి. కొన్ని వెబ్‌సైట్స్‌లో వార్తలు కూడా వచ్చాయి. ఇది దేవా(ధనుష్ పాత్ర పేరు) సినిమా. ఇది దీపక్(నాగ్ పాత్ర పేరు) సినిమా. ఇది సమీర(రష్మిక) సినిమా. అన్నింటికీ మించి ఇది శేఖర్ కమ్ముల సినిమా' అని నాగ్ చెప్పుకొచ్చారు.

(ఇదీ చదవండి: నాగ్‌ నిర్ణయం నాకు స్ఫూర్తినిచ్చింది: చిరంజీవి)

దీనంతటికి కారణం నాగ్ మాటలే. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఇది శేఖర్ కమ్ముల మూవీ అని చెప్పారు. రిలీజ్ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతున్న టైంలో తన పాత్ర మెయిన్ అని, దాంతో తానే హీరో అని నాగ్ అన్నారు. ఇది నా సినిమా కూడా అన్నారు. దీంతో ముందు ఇలా అన్నారు తర్వాత ఇలా అన్నారు అని పలు తమిళ క్రిటిక్స్ విమర్శలు చేశారు. ధనుష్‌ని నాగ్ తక్కువ చేసేలా మాట్లాడుతున్నాడని ట్రోల్ చేశారు. ఇప్పుడు నాగ్ తన కామెంట్స్‌తో వాటికి చెక్ పెట్టేశాడని చెప్పొచ్చు.

ధనుష్,నాగ్, రష్మిక.. ఇలా స్టార్స్ నటించిన 'కుబేర'కు రిలీజ్‌కి ముందు ఓ మాదిరి బజ్ మాత్రమే ఉంది. ఎప్పుడైతే పాజిటివ్ టాక్ వచ్చిందో థియేటర్లు హౌస్‪‌ఫుల్స్ అవుతున్నాయి. చాలారోజుల నుంచి మంచి సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులు.. దీన్ని చూస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లో రూ.50 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

(ఇదీ చదవండి: నేను నటించగలనని శేఖర్ కమ్ముల నిరూపించారు: రష్మిక)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)