Breaking News

సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు: అభిషేక్ నామా

Published on Mon, 07/06/2026 - 22:38

విరాట్ కర్ణ, నభా నటేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం నాగబంధం. ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. అనంత పద్మనాభ స్వామి బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కించారు. ఈ నెల 3న  థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్ పరంగా అభిమానుల్ని ఆకట్టుకుంటున్నప్పటికీ కంటెంట్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది. ఫైట్స్ సహా కొన్ని సన్నివేశాలు అనవసర నిడివిని పెంచాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.

తాజాగా నాగబంధం సనాతన జాగరణ కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు హాజరైన డైరెక్టర్ అభిషేక్‌ నామా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మూవీ తన రెండున్నరేళ్ల కష్టమని థియేటర్‌లో చూసి ఆదరించాలని దర్శకుడు సినీ ప్రేక్షకులను కోరారు. మా సినిమా విషయంలో కొన్ని తప్పులు జరిగి ఉండవచ్చు. ప్రేక్షకులు, నిజమైన సినీ విమర్శకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిడివి తగ్గించామని తెలిపారు. 

మరికొందరు సినిమా విడుదల కాకముందే రివ్యూలు ఇచ్చారు.. ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి మీ అభిప్రాయం చెబితే మాకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ మూవీ కల్పిత కథ కాదు. చరిత్రలో జరిగినదే తర్వాతి తరాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో పొందుపరిచామని అభిషేక్ నామా అన్నారు. మన హిందువులకి జరిగిన అన్యాయాన్ని ఈ సినిమాలో చూపించానని అన్నారు. నేను కేవలం ఒక పదిశాతం మాత్రమే ఈ సినిమాలో చెప్పానని తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)