మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
ప్రత్యేక ఆకర్షణగా నాగశౌర్య పెళ్లి భోజనాలు, అరేంజ్‌మెంట్స్ చూస్తే షాకవ్వాల్సిందే
Published on Mon, 11/21/2022 - 11:16
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన ప్రియురాలు అనూష శెట్టితో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. నవంబర్ 20న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో నాగశౌర్య వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్ నాగశౌర్య-అనూష శెట్టిల రాయల్ వెడ్డింగ్‌కి వేదికైంది. ప్రస్తుతం నాగశౌర్య పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వీరి గ్రాండ్ వెడ్డింగ్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లను వీపరితంగా ఆకట్టుకుంటున్నాయి.
చదవండి: ప్రేమించిన అమ్మాయితో నాగశౌర్య వివాహం.. ఫోటోలు వైరల్
ఇక నాగశౌర్య పెళ్లి వేడుకల్లో ఏర్పాటు చేసిన విందు భోజనాలు కూడా ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. పెళ్లికి వచ్చిన అతిథులందరికీ రాచరికపు స్టైల్లో భోజనాలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంప్రదాయం ప్రకారం కంచాల్లో బంతి భోజనాలు వడ్డించారు. అయితే ఒక్కో అతిథికి ప్రత్యేకంగా ఒక్కో టేబుల్ ఏర్పాటుచేశారు. ఈ టేబుల్స్ అష్టభుజ ఆకారంలో చాలా అందంగా ఉన్నాయి. విందులో భాగంగా 12 రకాల వంటలు, 4 రకాల స్వీట్స్, పెట్టినట్టు తెలుస్తోంది. కాగా టాలీవుడ్ సెలబ్రిటీల కోసం త్వరలో హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసేందుకు నాగాశౌర్య ప్లాన్ చేసినట్లు సమాచారం.
@IamNagashaurya 👌 pic.twitter.com/71NdpGjuAE
— devipriya (@sairaaj44) November 20, 2022
Royal Lunch Arrangement @ #NagaShaurya wedding 👌👌#LetsGoShaan ❤️ #AnushaShetty pic.twitter.com/KqX3lUMmO6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) November 20, 2022
Tags : 1