Breaking News

ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో?

Published on Tue, 06/27/2023 - 18:20

'బయటి ఊళ్లో బానిసలా బతికినా తప్పులేదు భయ్యా.. కానీ సొంతూరిలో మాత్రం సింహంలా ఉండాలి'.. ఈ ఒక‍్క డైలాగ్ తో 'రంగబలి' స్టోరీ ఏంటనేది దాదాపుగా చెప్పేశారు. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా.. జూలై 7న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ ని విడుదల చేసింది. హీరో- సొంతూరు అంటే ఇష్టం అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ చిత్రానికి పూర్తి ఫన్నీగా తీర్చిదిద‍్దినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ట్రైలర్ ఉంది.

(ఇదీ చదవండి: జెట్ స్పీడ్‌లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)

ట్రైలర్ లో ఏముంది?
సొంతూరంటే ఇష్టం, ప్రేమ, పిచ్చి ఉన్న ఓ కుర్రాడు.. పండగ, పబ్బం ఏదైనా సరే ఇక్కడి ఉండి చేసుకునే రకం. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉన్న హీరో లైఫ్ లోకి కొన్ని సమస్యలు రావడం వరకు ట్రైలర్ లో చూపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది బిగ్ స్క్రీన్ పై చూడాలి. ఈ ట్రైలర్ లోనే హీరోయిన్ తో ఓ లవ్ ట్రాక్ కూడా ఉన్నట్లు చూపించారు. అంతా చూస్తుంటే చాలావరకు తెలిసిన కథలానే అనిపిస్తుంది కానీ సినిమాలో కామెడీతో ఏమైనా మాయ చేస్తారేమో చూడాలి?

బూతు డైలాగ్ మర్చిపోయారా?
'రంగబలి' ట్రైలర్ అంతా బాగానే ఉంది కానీ 'దింపి..' అనే ఓ బూతు డైలాగ్ ని అలానే ఉంచేశారు. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఇది అవాక్కయ్యేలా చేసింది. ఎందుకంటే ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ ల‍్లో ఇలాంటి డైలాగ్స్ అంటే పర్లేదు కానీ బిగ్ స్క్రీన్ పై చూసే సినిమాల్లో ఇలాంటి డైలాగ్ చెప్పడం కాస్త వింతగా అనిపించింది. సెన్సార్ కి వెళ‍్తే.. దీన‍్ని కచ్చితంగా  బీప్ చేసే అవకాశముంది. ఇందులో నాగశౌర్యకి హీరోయిన్ గా యుక్తి తరేజా నటించింది. సత్య కామెడీతో నవ్వులు పూయించాడు. 'దసరా' ఫేమ్ షైన్ టామ్ చాకో విలన్ గా సందడి చేయబోతున్నాడు. 

(ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)