Breaking News

దీపావళి వేడుకల్లో నాగచైతన్య-శోభిత.. పెళ్లి తర్వాత తొలిసారిగా..!

Published on Tue, 10/21/2025 - 15:18

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) దంపతులు దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు.  పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా తొలిసారి దివాళీని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను చైతూ సతీమణి శోభిత ధూలిపాల సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. గతేడాది డిసెంబర్‌లో చైతూ-శోభిత వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ సినీ ప్రముఖులంతా సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు వెంకటేశ్‌ కూడా పాల్గొన్నారు. 

కాగా.. అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) గతేడాది తండేల్ మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ప్రస్తుతం చైతూ విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్‌ వర్మ దండు డైరెక్షన్‌లో పని చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీకి వృషకర్మ అనే (వర్కింగ్‌ టైటిల్‌) ఖరారు చేశారు. ఇది నాగచైతన్య కెరీర్‌లో 24వ చిత్రంగా నిలవనుంది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారని టాక్. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.  

 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)