బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు
Breaking News
మీకు సడన్‌గా రూ.500 కోట్లు ఇస్తే ఏం చేస్తారు?.. శేఖర్ కమ్ముల ఏమన్నారో తెలుసా?
Published on Fri, 06/20/2025 - 16:04
శేఖర్ కమ్ముల అంటే ఒక మార్క్. ఆయన సినిమా తీశాడంటే కథ మాములుగా ఉండదు. నాగచైతన్యతో లవ్ స్టోరీ మూవీ తీశాక అంటే.. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనుశ్, నాగార్జున ప్రధాన పాత్రల్లో కుబేర అనే సినిమాను తెరకెక్కించారు. అభిమానుల భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్ రిలీజైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమాకు రిలీజ్ ముందురోజే నాగచైతన్యతో కలిసి నాగార్జున, శేఖర్ కమ్ముల చిట్ చాట్ నిర్వహించారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా చైతూ వాళ్లిద్దరికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ చిట్ చాట్ చాలా ఫన్నీగా, సరదాగా సాగింది. ఇందులో శేఖర్ కమ్ములకు ఓ ఆసక్తికర ప్రశ్న వేశాడు నాగచైతన్య.
సడన్‌గా మీకు రూ.500 కోట్లు ఇచ్చి.. ఏం చేసినా పర్లేదు అంటే మీరు ఏం చేస్తారు? అని అడిగాడు. దీనికి శేఖర్ కమ్ముల ఆ ఐదొందల కోట్లు తీసుకుని ఏదైనా మంచి సినిమా చేస్తా అన్నారు. పక్కనే నాగార్జునను మీరేం చేస్తారని అడగ్గా.. నాకేందుకురా వద్దే వద్దు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
#NagaChaitanya: Sudden gaa meeku ₹500 crores isthe, meeru em chestharu?#Nagarjuna: వద్దు… I don’t want. 😄#KuberaaInCinemasTomorrow pic.twitter.com/WOCNViedfH
— Whynot Cinemas (@whynotcinemass_) June 19, 2025
Tags : 1