హమాస్ దాడి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బుల్లితెర నటి వీడియో!

Published on Tue, 10/10/2023 - 17:10

హమాస్ తీవ్రవాదుల దాడితో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధ జరుగుతోంది. ఇప్పటికే వందలమందిని బందీలుగా పట్టుకున్న ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తీవ్రవాదులు అత్యంత దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి షేర్ చేసిన వీడియో కన్నీళ్లు తెప్పిస్తోంది. ఈ దాడుల్లో తన కజిన్ సోదరి, బావను అత్యంత దారుణంగా చంపేశారని మధురా నాయక్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో ఓ వీడియోను షేర్ చేసింది.

వారి పిల్లల కళ్లముందే భార్య, భర్తను హతమార్చారని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. అంతే కాకుండా ఇజ్రాయెల్‌లో మహిళలు, పిల్లలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పట్టపగలే దారుణంగా హత్యలు చేస్తున్నారని మధుర వాపోయింది. 

మధుర మాట్లాడుతూ..' నా సోదరి, ఆమె భర్తను పాలస్తీనా ఉగ్రవాదులు వారి పిల్లల ముందే దారుణంగా హత్య చేశారు. ఈరోజు శవమై కనిపించారు. ఉగ్రదాడిలో మా బంధువును కోల్పోయినందుకు చాలా బాధపడ్డా. వారి ఆప్యాయత, దయ, ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా ప్రార్థనలు బాధితులందరికీ అండగా ఉంటాయి. ఓం శాంతి. ఈ కష్టకాలంలో దయచేసి ఇజ్రాయెల్ ప్రజలకు అండగా నిలవండి. ఉగ్రవాదుల‍ అరాచకాలు ఎంత అమానవీయంగా ఉంటాయో ప్రజలు ప్రత్యక్షంగా చూసే సమయం ఇదే,' అని తెలిపింది.

తాను ఎలాంటి హింసను సమర్థించనని.. ఇజ్రాయెల్‌లోని ప్రజల కోసం, బాధిత కుటుంబాల కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆమె కోరారు. కాగా.. మధుర నాగిన్, కసౌతి జిందగీ కే, ఉత్తరన్, ప్యార్ కీ యే ఏక్ కహానీ, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ అనే సీరియల్స్‌లో నటించింది. 

Videos

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)