Breaking News

'పుష్ప' రిలీజ్.. ఏడాది వరకు పూర్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదు: నిర్మాత

Published on Fri, 11/28/2025 - 17:29

ప్రస్తుతం టాలీవుడ్‌లో పరిస్థితులు ఏం బాగోలేవు. భారీ బడ్జెట్ సినిమాల దగ్గర నుంచి చిన్న సినిమాల వరకు పెట్టుబడికి వచ్చిన కలెక్షన్స్‌కి అస్సలు సంబంధం ఉండటం లేదు. గత కొన్నాళ్ల నుంచి అయితే హీరోల రెమ్యునరేషన్ల విషయంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా రిలీజైన కొన్ని సినిమాలకు హీరోలు, పారితోషికం తీసుకోకుండానే  పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇదే టాపిక్‌పై మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పందించారు.

(ఇదీ చదవండి: వీకెండ్ హంగామా.. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 20 మూవీస్)

మైత్రీ మూవీస్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. రామ్ హీరోగా నటించాడు. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న దృష్ట్యా.. మీడియా మీట్ నిర్వహించారు. నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలు, వాళ్ల రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో నటించినందుకుగానూ రామ్ రెమ్యునరేషన్ తీసుకోలేదని, బదులుగా నైజాం, గుంటూరు డిస్ట్రిబ్యూషన్ హకుల్ని తీసుకున్నారని తెలిపారు. మిగతా హీరోల గురించి మీడియా నుంచి ప్రశ్న ఎదురవగా ఒక్కొక్కరి గురించి చెప్పుకొచ్చారు.

'రెమ్యునరేషన్ విషయంలో ఎన్టీఆర్ అయినా, ప్రభాస్ అయినా ఎప్పుడుంటే అప్పుడివ్వండనే టైపు.. 'మీకు మిగిలితేనే ఇవ్వండి లేకపోతే లేదు' అని పవన్ కల్యాణ్ అన్నారు. 'పుష్ప' రిలీజ్ అయిన ఏడాది వరకూ అల్లు అర్జున్‌కు పూర్తి రెమ్యూనరేషన్ మేం ఇవ్వలేదు. 'రంగస్థలం' సినిమాకు రామ్ చరణ్ రెమ్యునరేషన్ నాలుగు కోట్లు ఎంతో మేం బ్యాలెన్స్ ఉన్నాం. నాకు అవసరం అయినప్పుడు తీసుకుంటా అని, అప్పుడొక ఇరవై, అప్పుడొక పాతిక లక్షల చొప్పున రెండేళ్లు తీసుకున్నారు. మా వరకూ అందరు హీరోలూ సహకరించారు' అని నిర్మాత రవిశంకర్.. తెలుగు హీరోలతో తమ బాండింగ్ గురించి వెల్లడించారు.

(ఇదీ చదవండి: 'ఆంధ్ర కింగ్ తాలూకా' మొదటి రోజు కలెక్షన్ ఎంత?)

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)