Breaking News

మైత్రి మూవీస్‌తో ధ్రువ్ సినిమా.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్స్‌ ఎంట్రీ

Published on Mon, 02/16/2026 - 10:43

తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ కొత్త సినిమాను లాక్‌ చేసే పనిలో ఉన్నాడు. గతేడాదిలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా బైసన్‌తో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడు. అయితే, ఈసారి డైరెక్ట్‌గా తెలుగు సినిమా చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మణిరత్నంతో ఒక  లవ్‌స్టోరీ చేసే ప్లాన్‌లో ఉన్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.  అందమైన ప్రేమకథకి హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ని ఎంపిక చేసినట్లు వైరల్‌ అయింది.

అయితే, ఈ ప్రాజెక్టుకు నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. అతను తన షార్ట్ ఫిల్మ్ 'మనసానమః' తో ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ధ్రువ్‌తో సినిమా ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం.  ఈ చిత్రం ఒక రొమాంటిక్-కామ్ ఎంటర్టైనర్ అని, ఇందులో  రుక్మిణీ వసంత్‌తో పాటు  శ్రీలీల మరో మహిళా కథానాయికగా నటించనుందని చెబుతున్నారు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ధ్రువ్ విక్రమ్‌ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేయనుంది. ఈ చిత్రానికి మ్యాన్ ఆఫ్ ది మూమెంట్ సాయి అబ్యాంకర్ సంగీతం అందిస్తున్నట్లు చెబుతున్నారు. అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఈ వార్త వైరల్ అవుతోంది.

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)