Breaking News

లిటిల్ హార్ట్స్ మౌళికి భారీ రెమ్యునరేషన్‌తో మైత్రీ సినిమా!

Published on Tue, 10/14/2025 - 07:51

లిటిల్ హార్ట్స్ (Little Hearts)సినిమాతో నటుడు మౌళి(Mouli Tanuj ) భారీ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. గతేడాదిలో ‘హ్యాష్‌ట్యాగ్ 90s’ అనే వెబ్ సిరీస్‌తో యూత్‌కు బాగా దగ్గరైన మౌళి తన టైమింగ్‌ డైలాగ్స్‌తో గుర్తింపు సంపాదించాడు. హీరోగా తొలి సినిమా ‘లిటిల్ హార్ట్స్’తో బాక్సాఫీస​్‌ వద్ద కాసుల వర్షం కురిపించాడు. ఇప్పుడు పెద్ద నిర్మాతలు కూడా తనతో ఒక సినిమా చేద్దాం అనుకునే రేంజ్‌కు చేరుకున్నాడు. కొత్త దర్శకులు కూడా ఇప్పటికే  స్టోరీ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఒక భారీ నిర్మాణ సంస్థ నుంచి మౌళికి బిగ్‌ ఆఫర్‌ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

చిన్న సినిమాగా విడుదలైన లిటిల్‌ హార్ట్స్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ. 40 కోట్లకు పైగానే కలెక్షన్స్‌ రాబట్టింది. ఓటీటీలో కూడా ఈ చిత్రం దూసుకుపోతుంది. దీంతో అతని మార్కెట్‌ కూడా పెరిగింది.  ఇప్పుడు మౌళికి ఏకంగా మైత్రీ మూవీ మేకర్స్‌ నుంచి సినిమా ఆఫర్‌ ఇవ్వడమే కాకుండా అడ్వాన్స​్‌ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. ఏకంగా రూ. కోటి రెమ్యునరేషన్‌ కూడా వారు ఇస్తామని చెప్పినట్లు సమాచారం. కేవలం రెండో సినిమాకే ఈ రేంజ్‌ రెమ్యునరేషన్‌ ఇస్తామని చెప్పడం పెద్ద విషయమేనని చెప్పాలి. 

ఒక సినిమా హిట్‌ అయినప్పటికీ మరో ఛాన్స్‌ రావడం కష్టంగా ఉన్న ఈరోజుల్లో ఒక పెద్ద నిర్మాణ సంస్థ తన వద్దకే వచ్చి ఇలా ఆఫర్‌ ఇవ్వడం అంటే సాధారణ విషయం కాదు. దీనంతటికీ కారణం మౌళికి యూత్‌తో బాగా కనెక్ట్‌ ఉంది. సోషల్‌మీడియాలో భారీ ఇమేజ్‌ ఉంది. అందుకే తనకు మైత్రీ మూవీస్‌ సినిమా అవకాశం ఇచ్చినట్లు టాక్‌. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో రావచ్చు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)