Breaking News

సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ విన్నర్‌!

Published on Mon, 05/27/2024 - 12:36

బిగ్‌బాస్‌ సీజన్‌-17 విన్నర్‌ మునావర్ ఫారూఖీ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. స్టాండ్ అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మునావర్ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యాడు. బిగ్ బాస్- 17 విన్నర్‌గా నిలవడంతో మరింత ఫేమ్ దక్కించుకున్నారు.

అయితే తాజాగా మునావర్ ఫరూఖీ  రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ముంబైలోని ప్రముఖ ఐటీసీ హోటల్‌లో సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మునావర్ తన పెళ్లి ఫోటోలను ఇప్పటి వరకు షేర్ చేయలేదు. మేకప్ ఆర్టిస్ట్ అయిన మెహజ్బీన్ కోట్వాలా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మునావర్ దాదాపు 10-12 రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ముంబయిలో రిసెప్షన్ వేడుక నిర్వహించిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.

munaawar

అతని వివాహానికి అత్యంత సన్నిహితురాలు అయిన నటి హీనా ఖాన్ హాజరైనట్లు కూడా తెలుస్తోంది. 'మేరే యార్ కి షాదీ హై' అంటూ ఆమె సెల్ఫీని కూడా పంచుకుంది. కాగా.. బిగ్ బాస్ 17లో మునావర్ తన మాజీ ప్రేయసి అయేషా ఖాన్ మోసం చేశాడని ఆరోపించింది. అతని మాజీ స్నేహితురాలు నజీలా సితాషి కూడా అతను పెద్ద మోసగాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)