Breaking News

సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక పరిణామం.. సీసీటీవీల్లో నిందితుడి దృశ్యాలు

Published on Thu, 01/16/2025 - 18:50

సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోని సీసీ ఫుటేజ్‌ను పోలీసులు రిలీజ్ చేశారు. అందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇవాళ తెల్లవారుజామున సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. 

అసలేం జరిగిందంటే..

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan)పై ఇవాళ తెల్లవారుజామున దాడి జరిగింది. ముంబయిలోని ఆయన నివాసంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సైఫ్‌ అలీఖాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సైఫ్‌.. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ఆయనకు సర్జరీ చేయగా.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ముంబై పోలీసుల కథనం ప్రకారం.. తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించగా.. ఆయన సిబ్బంది గట్టిగా అరవడంతో మేల్కొన్న సైఫ్‌.. ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ఆ దొంగ సైఫ్‌ అలీఖాన్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాడపడ్డ సైఫ్‌ని కుటుంబ సభ్యులు హుటాహుటిన లీలావతి ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి జరిగిన సమయంలో  సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు.
 

 

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)